Telugu Global
NEWS

ఐపీఎల్ వైఫల్యాలతో కొహ్లీ కొత్తరాగం

ప్రపంచకప్ కు ఐపీఎల్ ప్రామాణికం కాదంటూ వాదన కెప్టెన్ కొహ్లీ కి వంతపాడుతున్న వైస్ కెప్టెన్ రోహిత్ కెప్టెన్, కోచ్ ల చేతిలోనే ప్రపంచకప్ కు జట్టు ఎంపిక టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాటమార్చాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకూ….ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు …ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికంగా ఉంటుందంటూ నొక్కి చెప్పిన కొహ్లీ…ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో తన వరుస వైఫల్యాల తరువాత మాట మార్చాడు.  ఐపీఎల్ ప్రదర్శన….ప్రపంచకప్ జట్టు ఎంపికకు ఏమాత్రం […]

ఐపీఎల్ వైఫల్యాలతో కొహ్లీ కొత్తరాగం
X
  • ప్రపంచకప్ కు ఐపీఎల్ ప్రామాణికం కాదంటూ వాదన
  • కెప్టెన్ కొహ్లీ కి వంతపాడుతున్న వైస్ కెప్టెన్ రోహిత్
  • కెప్టెన్, కోచ్ ల చేతిలోనే ప్రపంచకప్ కు జట్టు ఎంపిక

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మాటమార్చాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకూ….ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు …ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికంగా ఉంటుందంటూ నొక్కి చెప్పిన కొహ్లీ…ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో తన వరుస వైఫల్యాల తరువాత మాట మార్చాడు.

ఐపీఎల్ ప్రదర్శన….ప్రపంచకప్ జట్టు ఎంపికకు ఏమాత్రం గీటురాయి కాదని తేల్చి చెప్పాడు. మార్చి 30 నుంచి జులై 15 వరకూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు కూర్పుకు ఐపీఎల్ ఏమాత్రం ప్రామాణికం కాదని చెప్పాడు.

ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తమతమ స్థానాలు ఖాయం చేసుకోగా…నాలుగో నంబర్ స్థానం పై తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి.

రెండో డౌన్ స్థానానికి రాయుడు ఖాయమని గతంలోనే ప్రకటించిన కొహ్లీ….ఐపీఎల్ కు ముందు మాత్రం…నాలుగో నంబర్ స్థానం కోసం ఇంకా పోటీ ఉందని…ఐపీఎల్ లో కనబరచిన ప్రతిభ ప్రాతిపదికనే ఎంపిక చేస్తారంటూ పలు వేదికల ద్వారా ప్రకటించాడు.

అజింక్యా రహానే, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడుల మధ్య…రెండో డౌన్ స్థానం కోసం పోటీ ఉన్నట్లుగా కొహ్లీ తెలిపాడు.

రాయుడుకు టెన్షన్ టెన్షన్…

ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్ మొదటి మూడు వన్డేల్లో 13, 18, 2 స్కోర్లు సాధించిన అంబటి రాయుడు…. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ మొదటి నాలుగు మ్యాచ్ ల్లో సైతం 28, 5, 1, 0, స్కోర్లతో విఫలమయ్యాడు.

దీనికితోడు…బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సైతం వరుస వైఫల్యాలతో ఢీలా పడడంతో….టీమిండియా ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శన ఏమాత్రం ప్రామాణికం కాదంటూ వివరణ ఇచ్చారు.

కెప్టెన్, చీఫ్ కోచ్ ల చేతిలోనే ఎంపిక అధికారం…

ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా ఎంపిక అధికారం కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రిల విచక్షణ అధికారంపైనే ఆధారపడి ఉంటుందని…తుదిజట్టులో ఎవరు ఉండాలో నిర్ణయించాల్సింది కేవలం వారేనని… టీమిండియా ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు.

ఈ నేపథ్యంలో… ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ఎంపిక కథ…మళ్లీ మొదటి కొచ్చినట్లు అయ్యింది.

First Published:  5 April 2019 12:56 PM IST
Next Story