చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏ వ్యవస్థ ఏమీ చేయలేదన్న ధైర్యం కాబోలు దర్జాగా తాను ఓటర్లను ఎలా ప్రలోభపెడుతున్నది ఎన్నికల ప్రచార సభలోనే ప్రకటించారు. డబ్బులు ఖర్చు పెడదామంటే ఐటీ దాడులు చేస్తున్నారని…. అందుకే కొత్త ఆలోచన చేశానని చెప్పారు. శుభ్రంగా ప్రభుత్వ సొమ్మునే పంచుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు ఏమన్నారంటే… ”ఎన్నికల్లో ఐదు రూపాయలు పంచుదామంటే ఐటీ దాడులు చేస్తున్నారు. కార్యకర్తలను ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టనివ్వడం లేదు. ఎంత దుర్మార్గం తమ్ముళ్లు. ఇది న్యాయమా?. అందుకే ఆలోచించా. […]
చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏ వ్యవస్థ ఏమీ చేయలేదన్న ధైర్యం కాబోలు దర్జాగా తాను ఓటర్లను ఎలా ప్రలోభపెడుతున్నది ఎన్నికల ప్రచార సభలోనే ప్రకటించారు.
డబ్బులు ఖర్చు పెడదామంటే ఐటీ దాడులు చేస్తున్నారని…. అందుకే కొత్త ఆలోచన చేశానని చెప్పారు. శుభ్రంగా ప్రభుత్వ
సొమ్మునే పంచుతున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబు ఏమన్నారంటే… ”ఎన్నికల్లో ఐదు రూపాయలు పంచుదామంటే ఐటీ దాడులు చేస్తున్నారు. కార్యకర్తలను ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టనివ్వడం లేదు. ఎంత దుర్మార్గం తమ్ముళ్లు. ఇది న్యాయమా?. అందుకే ఆలోచించా. శుభ్రంగా
నేనైతే పైసా ఇవ్వను గానీ… ప్రభుత్వ డబ్బునే ఇస్తున్నా. పించన్ రెండువేలు ఇచ్చా. రైతులకు మూడు వేలు ఇచ్చా. పసుపు-కుంకుమ కింద నాలుగువేలు ఇచ్చా” అని ప్రకటించారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సొంత డబ్బు తీయకుండా ప్రభుత్వ డబ్బునే వాడుతున్నానని స్వయంగా చంద్రబాబే అంగీకరించేశారు. నిజానికి రైతు భరోసా, పసుపు-కుంకుమ గురించి ఎన్నికల ప్రచార సభల్లో ఏ నాయకుడు
ప్రస్తావించడానికి వీల్లేదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కానీ చంద్రబాబు బహిరంగంగానే విశాఖ సభలో తాను ఓటర్లను ప్రభుత్వ డబ్బుతో ఎలా ప్రలోభపెడుతున్నది ప్రకటించేశారు. చూడాలి ఈసీ చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటుందో లేదో.