Telugu Global
NEWS

ఆంధ్రా వారికి చుక్కలు చూపించేవాడిని....

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ … చంద్రబాబును మించిపోయాడు. ఏ పూటకు ఆ మాట, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వాదన వినిపించడంలో చంద్రబాబుకు శిష్యుడిగా పవన్‌ కల్యాణ్ తయారయ్యాడు. ఆంధ్రా ప్రాంత ఎన్నికల ప్రచార సభల్లో రాయలసీమ వాళ్లను, తెలంగాణ వాళ్లను తిట్టే పవన్‌ కల్యాణ్… హైదరాబాద్ ఎల్‌బీనగర్‌ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. తెలంగాణలో తాను పుట్టకపోవడం దురదృష్టమన్నారు. అంతటితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమం నా చేతుల్లోనే ఉండి ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాడినని వ్యాఖ్యానించారు. […]

ఆంధ్రా వారికి చుక్కలు చూపించేవాడిని....
X

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ … చంద్రబాబును మించిపోయాడు. ఏ పూటకు ఆ మాట, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వాదన వినిపించడంలో చంద్రబాబుకు శిష్యుడిగా పవన్‌ కల్యాణ్ తయారయ్యాడు.

ఆంధ్రా ప్రాంత ఎన్నికల ప్రచార సభల్లో రాయలసీమ వాళ్లను, తెలంగాణ వాళ్లను తిట్టే పవన్‌ కల్యాణ్… హైదరాబాద్ ఎల్‌బీనగర్‌ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు.

తెలంగాణలో తాను పుట్టకపోవడం దురదృష్టమన్నారు. అంతటితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమం నా చేతుల్లోనే ఉండి ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాడినని వ్యాఖ్యానించారు.

ఇదే పవన్‌ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం ఆంధ్రాలో కార్యకర్తల సమావేశంలో తెలంగాణ వాళ్లు ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రా వాళ్ళకు పౌరుషం లేదా, ఆంధ్రులకు చీమునెత్తురు లేదా అని ఏపీలో రెచ్చగొట్టారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో మాత్రం తాను తెలంగాణ వాడినై ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాడినని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు.

కొత్త తరహా రాజకీయాలు తీసుకొస్తానని, కులాలను, ప్రాంతాలను ఏకం చేస్తానని చెబుతున్న పవన్ కల్యాణ్ ఇలా ప్రాంతానికో మాట మాట్లాడడం, ప్రాంతాల పేరుతో విధ్వేష ప్రసంగాలు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  5 April 2019 3:25 AM IST
Next Story