దేశవాళీ క్రీడ ఖో-ఖోలోనూ ఇక లీగ్
గ్రామీణ క్రీడకు డాబర్ సంస్థ కొత్తఊపిరి 8 ఫ్రాంచైజీలు, 60 మ్యాచ్ లతో లీగ్ ప్రత్యేక మ్యాట్లపై లీగ్ పోటీలు ఆసియాఖండ దేశాలలోని గ్రామీణ ప్రాంతాల క్రీడ ఖో-ఖో కు మంచిరోజులొచ్చాయి. క్రీడాపరికరాలు ఏమాత్రం అవసరం లేని, కనీస ఖర్చుతో నిర్వహించుకోగల అతికొద్ది క్రీడల్లో ఖో-ఖోకు ప్రత్యేక స్థానమే ఉంది. నాలుగు ఇన్నింగ్స్ తో… ఒక్కో ఇన్నింగ్స్ 9 నిముషాల నిడివితో నిర్వహించే ఈ క్రీడను పరుగు, కబడ్డీ క్రీడల సంమిళితంగా చెబుతారు. ఆసియా ఒలింపిక్ మండలి […]
- గ్రామీణ క్రీడకు డాబర్ సంస్థ కొత్తఊపిరి
- 8 ఫ్రాంచైజీలు, 60 మ్యాచ్ లతో లీగ్
- ప్రత్యేక మ్యాట్లపై లీగ్ పోటీలు
ఆసియాఖండ దేశాలలోని గ్రామీణ ప్రాంతాల క్రీడ ఖో-ఖో కు మంచిరోజులొచ్చాయి. క్రీడాపరికరాలు ఏమాత్రం అవసరం లేని, కనీస ఖర్చుతో నిర్వహించుకోగల అతికొద్ది క్రీడల్లో ఖో-ఖోకు ప్రత్యేక స్థానమే ఉంది.
నాలుగు ఇన్నింగ్స్ తో… ఒక్కో ఇన్నింగ్స్ 9 నిముషాల నిడివితో నిర్వహించే ఈ క్రీడను పరుగు, కబడ్డీ క్రీడల సంమిళితంగా చెబుతారు.
ఆసియా ఒలింపిక్ మండలి గుర్తింపు సొంతం చేసుకొన్న ఖో-ఖో క్రీడకు 2022 ఆసియాక్రీడల్లోనూ, 2032 ఒలింపిక్స్ లోను ఓ అంశంగా చేర్చేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే…డాబర్ ఇండియా సంస్థ సహకారంతో…అల్టిమేట్ ఖో-ఖో లీగ్ ను నిర్వహించాలని నిర్ణయించారు.
8 ఫ్రాంచైజీలు- 60 మ్యాచ్ లు….
ప్రత్యేకంగా తయారు చేసిన మ్యాట్లపైన ఖో-ఖో లీగ్ మ్యాచ్ లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో ఆసియాలోని 20 దేశాలకు చెందిన ఖో-ఖో క్రీడాకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
20 దేశాలలో ఖో-ఖో….
ఇంగ్లండ్, దక్షిణ కొరియా, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల ఖో-ఖో క్రీడాకారులు ఈలీగ్ లో భాగం కానున్నారు. ప్రతిభావంతులైన 18 ఏళ్ల వయసులోపు ఉన్న క్రీడాకారులను…. వివిధ ఫ్రాంచైజీల తరపున ఆడించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ప్రోకబడ్డీ లీగ్ తో …గ్రామీణ క్రీడ కబడ్డి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంటే.. అదే స్థాయికి చేరాలని…మరో గ్రామీణ క్రీడ ఖో-ఖో సైతం తహతహలాడుతోంది. లీగ్ తేదీలు, వేదికలు, ఫ్రాంచైజీలు, కార్యక్రమాలను ఖరారు చేయాల్సి ఉంది.