గో బ్యాక్ రాధా అంటున్న సొంత మనుషులు
టీడీపీలో చేరిన వంగవీటి రాధా పరిస్థితి ఏమంత బాగోలేదు. చివరకు సొంత మనుషులు కూడా ఆయన్ను దూరం పెడుతున్నారు. వంగవీటి రాధాను రంగా కుమారుడిగా అభిమానిస్తూ వస్తున్న వారు కూడా ఇప్పుడు ఆయనపై తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నారు. మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావును గెలిపించాలంటూ కేశవరం అనే గ్రామంలో ప్రచారం చేసేందుకు వంగవీటి రాధా వెళ్లగా గ్రామస్తులు దాదాపు కొట్టినంత పనిచేశారు. టీడీపీ తరపున ప్రచారానికి వంగవీటి రాధా వస్తున్నారని తెలుసుకున్న కేశవరం గ్రామంలోని కాపు కులస్తులు భారీగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. రాధా […]

టీడీపీలో చేరిన వంగవీటి రాధా పరిస్థితి ఏమంత బాగోలేదు. చివరకు సొంత మనుషులు కూడా ఆయన్ను దూరం పెడుతున్నారు. వంగవీటి రాధాను రంగా కుమారుడిగా అభిమానిస్తూ వస్తున్న వారు కూడా ఇప్పుడు ఆయనపై తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నారు.
మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావును గెలిపించాలంటూ కేశవరం అనే గ్రామంలో ప్రచారం చేసేందుకు వంగవీటి రాధా వెళ్లగా గ్రామస్తులు దాదాపు కొట్టినంత పనిచేశారు.
టీడీపీ తరపున ప్రచారానికి వంగవీటి రాధా వస్తున్నారని తెలుసుకున్న కేశవరం గ్రామంలోని కాపు కులస్తులు భారీగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. రాధా కాన్వాయ్ రాగానే గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు.
రంగాను చంపిన పార్టీ తరపున ఆయన కుమారుడివై ఉండి ఎలా ప్రచారానికి వచ్చావ్ అంటూ రాధాపై విరుచుకుపడ్డారు. రాధా గ్రామంలోకి రావడానికి వీల్లేదని కాపులు భీష్మించడంతో చేసేది లేక వంగవీటి రాధా రాజమండ్రి వైపు వెళ్లిపోయారు.