సమయం లేదు తమ్ముళ్లు.... ఎంతైనా సరే కొనండి !
“ చౌక బేరాలు వద్దు. అప్పుడు అలా ఇచ్చాం . ఇప్పుడు ఇలాగే ఇస్తాం. అనే మాటలు వద్దు. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వండి. తమ్ముళ్లూ.. ఇక సమయం లేదు” ఇదీ ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు పోటీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థుల విన్నపం. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలింది. దీంతో ఒకవైపు ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు […]
“ చౌక బేరాలు వద్దు. అప్పుడు అలా ఇచ్చాం . ఇప్పుడు ఇలాగే ఇస్తాం. అనే మాటలు వద్దు. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వండి. తమ్ముళ్లూ.. ఇక సమయం లేదు” ఇదీ ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు పోటీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థుల విన్నపం.
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలింది. దీంతో ఒకవైపు ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు మరోవైపు ఓటర్లను కొనుగోలు చేయడం అనే పనిలో పడ్డారు.
ఇందుకోసం పార్టీ కార్యకర్తలకు, నియోజక వర్గాల్లో సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వారికి “కట్టల” పాములు పంపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గతంలో అధికారాన్ని అనుభవించిన వారు ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే కోరికతో ఓటర్లకు ఎంత డబ్బైనా ఇవ్వడానికి వెనుకాడడం లేదని చెబుతున్నారు.
గత ఎన్నికలలో ఓటుకు రెండు వేల రూపాయల వంతున పంచి పెట్టి విజయాన్ని సాధించిన వారు ఈసారి 4000, 5000 ఇచ్చేందుకు వెనుకాడటం లేదని సమాచారం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లకు పంచేందుకు అవసరమైన నిధులు వెళ్లిపోయాయని, అవసరమైతే మరిన్ని కట్టలు పంపుతామంటూ కొందరు సీనియర్ నాయకులు తమ తమ్ముళ్లకు సందేశాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.
ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని, ఓటర్లు ఎంత మొత్తం డిమాండ్ చేసినా ఇచ్చేందుకు వెనుకాడవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ ల వారీగాను, గ్రామాలు, వార్డుల వారీగా డబ్బులు పంచేందుకు తమ్ముళ్లు సిద్ధమైనట్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా డబ్బులు పంచడంతోపాటు కుల సంఘాలకు, వివిధ కాలనీలకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంచాల్సిందిగా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
సమయం చాలా తక్కువగా ఉండడంతో ఎవరికీ అనుమానం రాని వ్యక్తుల చేత ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని జరిపించాలని నియోజకవర్గాలలో అభ్యర్థులు తమ్ముళ్లకు చెప్పినట్లు సమాచారం.