ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ రద్దు
రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. రామ్ చరణ్ కు గాయమైంది. దీంతో ఆర్-ఆర్-ఆర్ సినిమా షూటింగ్ రద్దయింది. సినిమా యూనిట్ స్వయంగా విషయాన్ని వెల్లడించింది. నిన్న సాయంత్రం జిమ్ చేస్తున్న టైమ్ లో గాయపడ్డాడు చరణ్. అతడి చీలమండకు గాయమైంది. దీంతో ఆర్-ఆర్-ఆర్ షెడ్యూల్ రద్దయింది. ఇదంతా పూణెలో జరిగింది. ఈ సినిమాకు సంబంధించి నార్త్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకంగా 38 రోజుల షెడ్యూల్ ఇది. యూనిట్ అంతా వడోదర వెళ్లింది. […]
రామ్ చరణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. రామ్ చరణ్ కు గాయమైంది. దీంతో ఆర్-ఆర్-ఆర్ సినిమా షూటింగ్ రద్దయింది. సినిమా యూనిట్ స్వయంగా విషయాన్ని వెల్లడించింది. నిన్న సాయంత్రం జిమ్ చేస్తున్న టైమ్ లో గాయపడ్డాడు చరణ్. అతడి చీలమండకు గాయమైంది. దీంతో ఆర్-ఆర్-ఆర్ షెడ్యూల్ రద్దయింది. ఇదంతా పూణెలో జరిగింది.
ఈ సినిమాకు సంబంధించి నార్త్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకంగా 38 రోజుల షెడ్యూల్ ఇది. యూనిట్ అంతా వడోదర వెళ్లింది. అక్కడ కొన్ని షాట్స్ తీశారు. తర్వాత పూణెకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఇలా అనుకోకుండా గాయపడ్డాడు చరణ్. డాక్టర్లు 3 వారాలు విశ్రాంతి తీసుకోమన్నారు. దీంతో ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ను కూడా 3 వారాలు వాయిదావేసినట్టు యూనిట్ తెలిపింది.
We regret to mention that #RamCharan confronted a minor ankle injury while working out at the gym, yesterday. The pune schedule has been called off. Back to action in 3 weeks! #RRR
— RRR Movie (@RRRMovie) April 3, 2019
ఇక్కడ మరో సమస్య కూడా తలెత్తింది. లెక్కప్రకారం ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ అలియా భట్ జాయిన్ అవ్వాలి. ఈ మేరకు ఆమె కాల్షీట్లు కూడా ఎడ్జెస్ట్ చేసింది. ఇప్పుడు చరణ్ గాయపడ్డంతో, ఆమె కాల్షీట్లన్నీ వృధా అయ్యాయి. తిరిగి మళ్లీ ఆమె కాల్షీట్లు సంపాదించడం చాలా కష్టం.