Telugu Global
NEWS

నేను ఓడిపోతే నాకు మనవడు ఉన్నాడు " చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకో గానీ తన ప్రసంగాల్లో తనలోని భయాన్ని బయట పెట్టుకుంటున్నారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు… ప్రసంగాల్లో తడబడుతున్నారు. తాజాగా తాను ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. మోడీని విమర్శించే క్రమంలో మోడీకి కుటుంబ సభ్యులు కూడా లేరని విమర్శించారు. ప్రధాని పదవి పోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో కూడా మోడీకి తెలియదన్నారు చంద్రబాబు. కానీ తనకు అలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే తనకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. ”ఎన్నికల్లో ఓడిపోతే నాకు భార్య ఉంది, కొడుకు […]

నేను ఓడిపోతే నాకు మనవడు ఉన్నాడు  చంద్రబాబు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకో గానీ తన ప్రసంగాల్లో తనలోని భయాన్ని బయట పెట్టుకుంటున్నారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు… ప్రసంగాల్లో తడబడుతున్నారు. తాజాగా తాను ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. మోడీని విమర్శించే క్రమంలో మోడీకి కుటుంబ సభ్యులు కూడా లేరని విమర్శించారు.

ప్రధాని పదవి పోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో కూడా మోడీకి తెలియదన్నారు చంద్రబాబు. కానీ తనకు అలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే తనకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. ”ఎన్నికల్లో ఓడిపోతే నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మనవడు కూడా ఉన్నాడు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నోట ఓటమి మాట రావడం, తాను ఓడిపోయినా ఇబ్బంది లేదని చెప్పడంతో టీడీపీ నాయకులే కంగుతిన్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనకు మనవడు కూడా ఉన్నారని చంద్రబాబు గుర్తు చేయడం ద్వారా… ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మనవడితో ఆడుకునేందుకు సిద్ధం అయ్యారని సెటైర్లు వేస్తున్నారు.

First Published:  3 April 2019 2:34 AM IST
Next Story