Telugu Global
NEWS

బాలకృష్ణ కోసం గాయాల పాలైన నిర్మాత

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం ఎన్నికల వేడి అంబరాన్ని అంటుతోంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ ప్రాంతాల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువ గా నే కనిపిస్తోంది. గతం లో లాగే ఈ సారి ఎన్నికల్లో కూడా నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ కి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన నెగ్గడం కష్టం. బలమైన ప్రత్యర్థి ఉండడం, ఆయన పార్టీ మీద కొంత […]

బాలకృష్ణ కోసం గాయాల పాలైన నిర్మాత
X

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం ఎన్నికల వేడి అంబరాన్ని అంటుతోంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ ప్రాంతాల్లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువ గా నే కనిపిస్తోంది. గతం లో లాగే ఈ సారి ఎన్నికల్లో కూడా నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ కి పోటీ చేస్తున్నారు.

ఈసారి ఆయన నెగ్గడం కష్టం. బలమైన ప్రత్యర్థి ఉండడం, ఆయన పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉండడం, ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం…. వంటి అంశాలు ప్రతికూలం గా మారే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గంలో పోయిన వేసవిలో తీవ్ర నీటి కొరత వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ జాడ లేకపోవడంతో స్థానికులు ఒక దున్నపోతు మీద బాలకృష్ణ అని పేరు రాసి నిరసన ప్రదర్శన చేశారు. అయినప్పటికీ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ, ప్రస్తుతం ఆయన హిందూపురం లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.

ఆయన తో పాటు లోకల్ లీడర్స్, ఆయన అనుచరులు, అభిమానులు, కొంత మంది సినిమా వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారు. బాలకృష్ణ కి తోడుగా సినిమా నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. వీరు నిన్న చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద ప్రచారం నిర్వహించారు.

అయితే ప్రచారం లో భాగంగా సదరు నిర్మాత బాలకృష్ణ వద్దకు వెళ్లేందుకు ప్రచార రథం ఎక్కేందుకు ప్రయత్నించగా అనుకోకుండా రథం కదలడం తో ఆయన కిందపడ్డాడు. ఆయన ని వెంటనే ఆసుపత్రి కి తీసుకొని వెళ్లగా ఎడమ చేతికి దెబ్బతగిలింది అని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం.

First Published:  3 April 2019 5:36 AM IST
Next Story