Telugu Global
NEWS

సుజనాచౌదరికి బిగ్‌ షాక్

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగొట్టిన వ్యవహారంలో 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుజనాచౌదరి కంపెనీలు ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి 364 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కానీ ఆ డబ్బును కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకుండా పలు షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్వాయిస్‌లతో దారి మళ్లించింది. దాంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈడీ కూడా రంగంలోకి దిగింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును […]

సుజనాచౌదరికి బిగ్‌ షాక్
X

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్‌ ఇచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగొట్టిన వ్యవహారంలో 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

సుజనాచౌదరి కంపెనీలు ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి 364 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కానీ ఆ డబ్బును కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకుండా పలు షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్వాయిస్‌లతో దారి మళ్లించింది.

దాంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈడీ కూడా రంగంలోకి దిగింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్నది ఈడీ తేల్చింది. సుజనా చౌదరి బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును మహల్‌ హోటల్‌ అనే షెల్‌ కంపెనీకి తరలించారు.

అక్కడి నుంచి ఆ సొమ్మును వైశ్రాయ్ హోటల్‌ లిమిటెడ్‌కు మళ్లించారు. ఈ డబ్బు ప్రవాహాన్ని ఈడీ ఆధారాలతో సహా గుర్తించింది. దీంతో వైశ్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌ పేరున ఉన్న 315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ విషయాన్ని ఈడీ అధికారికంగా ప్రకటించింది.

First Published:  2 April 2019 3:48 PM IST
Next Story