రామజోగయ్య కి ఉగాది పురస్కారం
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తర్వాత అంతటి స్థాయిలో సాహితీ ప్రేమికులను తన పాటల ద్వారా అలరిస్తుంది ఎవరు అంటే రామజోగయ్య శాస్త్రి. సిరివెన్నల దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసి విడిగా పాటలు రాయడం మొదలు పెట్టిన రామజోగయ్య సినీ ప్రస్థానంలో మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అవార్డుల్ని ఇప్పటికే సొంతం చేసుకున్న రామజోగయ్యకి ఉగాది పురస్కారం కూడా వరించనుంది. సుప్రసిద్ధ గుంటూరు సాహితీ సమాఖ్య వారు అందించే ఉగాది సాహితీ పురస్కారాన్ని […]
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి తర్వాత అంతటి స్థాయిలో సాహితీ ప్రేమికులను తన పాటల ద్వారా అలరిస్తుంది ఎవరు అంటే రామజోగయ్య శాస్త్రి.
సిరివెన్నల దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసి విడిగా పాటలు రాయడం మొదలు పెట్టిన రామజోగయ్య సినీ ప్రస్థానంలో మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అవార్డుల్ని ఇప్పటికే సొంతం చేసుకున్న రామజోగయ్యకి ఉగాది పురస్కారం కూడా వరించనుంది.
సుప్రసిద్ధ గుంటూరు సాహితీ సమాఖ్య వారు అందించే ఉగాది సాహితీ పురస్కారాన్ని ఈ సంవత్సరం రామజోగయ్య శాస్త్రి కి ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాదు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఈ వేడుక కి విచ్ఛేసి రామజోగయ్య కి ఈ పురస్కారాన్ని అందించనుండడం విశేషం. శ్రీ
వెంకటేశ్వర విజ్ఞాన మండపం లో సాహితీ వసంతోత్సవం తో పాటు అవార్డు ప్రదానోత్సవం కూడా ఏప్రిల్ 6 న జరగనుంది. ఈ వేడుకకి రానున్నట్లు ఇప్పటికే సిరివెన్నెల తన అంగీకారం కూడా తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం అనంతరం కవి సమ్మేళనం కూడా నిర్వహించనున్నారు. ప్రస్తుతం రామజోగయ్య సాహో, మహర్షి…. వంటి చిత్రాలకి గేయ రచన చేస్తున్నారు.