Telugu Global
NEWS

మాయావతిని... పవన్ ఏపీకి తీసుకురారా?

ఆంధ్రప్రదేశ్ శాసన సభ, లోక్ సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ముసుగులు ఒక్కొక్కటి తొలగి పోతున్నాయి. ఇన్నాళ్లు ఎవరు.. ఎవరికి మద్దతు పలుకుతారో, ఎవరు ఎవరిని భుజానికి ఎత్తుకుంటారు వంటి సందేహాలు ఉండేవి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ సందేహాలకు ఫుల్ స్టాప్ పడుతోంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఖరి పై ఒక్కొక్కటిగా సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో నామమాత్రంగా పోటీ చేస్తున్న జనసేన బిఎస్పీ నాయకురాలు […]

మాయావతిని... పవన్ ఏపీకి తీసుకురారా?
X

ఆంధ్రప్రదేశ్ శాసన సభ, లోక్ సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ముసుగులు ఒక్కొక్కటి తొలగి పోతున్నాయి. ఇన్నాళ్లు ఎవరు.. ఎవరికి మద్దతు పలుకుతారో, ఎవరు ఎవరిని భుజానికి ఎత్తుకుంటారు వంటి సందేహాలు ఉండేవి.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ సందేహాలకు ఫుల్ స్టాప్ పడుతోంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఖరి పై ఒక్కొక్కటిగా సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో నామమాత్రంగా పోటీ చేస్తున్న జనసేన బిఎస్పీ నాయకురాలు మాయావతిని హైదరాబాద్ తీసుకువస్తోంది.

తెలంగాణలో పోటీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొని ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న జనసేనకు ఎలాంటి బలం లేదు. అయినా మాయావతిని హైదరాబాద్ తీసుకురావడంలో పవన్ కల్యాణ్ ఆంతర్యమేమిటో తెలియడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో బలమున్న జనసేన అక్కడి శాసన సభ, లోక్ సభ నియోజక వర్గాలన్నింటిలోను పోటీ చేస్తోంది. “కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా..”అంటూ పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ అధికార తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడిపైన నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలంలో వారిని విమర్శించడం లేదు. పైగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ వైఖరితో జనసైనికులు ఇద్దెక్కడి రాజకీయం అంటూ మండిపడుతున్నారు.

మరోవైపు బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని హైదరాబాద్ రప్పిస్తున్న పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ లో ఆమె చేత ఎందుకు ప్రచారం చేయనివ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు, బిసీలు, మైనారిటి ఓట్లను ప్రభావితం చేయగల మాయావతిని అక్కడ ప్రచారానికి తీసుకు వెళ్లకపోవడం వెనుక తెలుగుదేశం తో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందమే కారణమా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 April 2019 5:43 AM IST
Next Story