ఏపీలో "కట్టల" పాములు
ఆంధ్రప్రదేశ్ లోకి “కట్టల”పాములు దిగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కట్టల కట్టల డబ్బు సంచులు గ్రామాలకు దిగుమతి అవుతున్నాయి. ఈ ఎన్నికలలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే పనికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని వందలాది గ్రామాలకు మద్యం సీసాల సరఫరా పూర్తి అయ్యింది అంటున్నారు. ఇక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నోట్ల కట్టలతో సిద్దమవుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. ఎన్నికల కమీషన్ […]
ఆంధ్రప్రదేశ్ లోకి “కట్టల”పాములు దిగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో కట్టల కట్టల డబ్బు సంచులు గ్రామాలకు దిగుమతి అవుతున్నాయి. ఈ ఎన్నికలలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే పనికి శ్రీకారం చుట్టాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని వందలాది గ్రామాలకు మద్యం సీసాల సరఫరా పూర్తి అయ్యింది అంటున్నారు. ఇక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నోట్ల కట్టలతో సిద్దమవుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. ఎన్నికల కమీషన్ నిబంధనలు, పోలీసుల తనిఖీలు ఎన్ని జరుగుతున్నా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియకు మాత్రం పుల్ స్టాప్ పడడం లేదు.
ఈ ఎన్నికలలో విజయం సాధించి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అధికార తెలుగు దేశం పార్టీ సర్వశక్తులు వడ్డుతున్నది. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన జనసేన సైతం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకుందుకు వారెంత అడిగితే అంత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఎన్నికల కమీషన్ గుర్తించిన కీలక నియోజక వర్గాలతో పాటు అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు ఇబ్బందులు పడుతున్న నియోజక వర్గాలలో కట్టల పాములు తిరుగుతున్నాయని అంటున్నారు.
కొన్ని నియోజకవర్గాలలో ఓటుకు 5000 రూపాయలు ఇచ్చేందుకు సైతం కొందరు అభ్యర్దులు ముందుకు వస్తున్నారు. దీంతో ఓట్ల కొనుగోలు ప్రక్రియ ఊపందుకున్నట్లు సమాచారం. రానున్న ఐదారు రోజులు కీలకం కావడంతో వివిధ మార్గాలలో డబ్బులు తరలించేందుకు అభ్యర్దులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలోను మద్యం సీసాలు, నోట్ల కట్టలు కనిపిస్తున్నాయని అంటున్నారు.