Telugu Global
NEWS

సీనియర్లు సహకరించరు... కొత్తవారిని కలుపుకోరు : కారులో కంగాళీ

కారులో కంగాళీగా ఉంది. కారులో గజిబిజిగా ఉంది. కారులో గత్తరగత్తరగా ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల వరకూ ఎంతో సౌకర్యంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లోక్ సభ ఎన్నికల నాటికి కస్సుబుస్సులాడుతోంది. కారు…. సారు.. ఢిల్లీలో సర్కారు అంటూ తెలంగాణ రాష్ట్ర సమతి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఇస్తున్న నినాదాన్ని పార్టీలో ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించటంలేదు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలు, […]

సీనియర్లు సహకరించరు... కొత్తవారిని కలుపుకోరు : కారులో కంగాళీ
X

కారులో కంగాళీగా ఉంది. కారులో గజిబిజిగా ఉంది. కారులో గత్తరగత్తరగా ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల వరకూ ఎంతో సౌకర్యంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లోక్ సభ ఎన్నికల నాటికి కస్సుబుస్సులాడుతోంది. కారు…. సారు.. ఢిల్లీలో సర్కారు అంటూ తెలంగాణ రాష్ట్ర సమతి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఇస్తున్న నినాదాన్ని పార్టీలో ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించటంలేదు.

సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలు, మంత్రులకు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలలో 16 స్థానాలను గెలుచుకోవాలని, మిగిలిన ఒక స్థానంలోను మిత్రపక్షం మజ్లీస్ గెలుస్తుందని కె. చంద్రశేఖర రావు పార్టీ వారికి చెబుతున్నారు.

అయితే వాస్తవ పరిస్దితులు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయంటున్నారు. లోక్ సభకు పోటీ చేస్తున్న వారెవ్వరికీ మంత్రులు కాని, ఎమ్మెల్యేలు కాని పార్టీ సీనియర్ నాయకులు కాని సహకరిస్తున్న పరిస్థితులు కనిపించటం లేదు. దీనికి తాజా ఉదాహరణ హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్న భారీ బహిరంగ సభను జనాలు లేక రద్దు చేయడమే. ఈ సభ రద్దుపై అగ్రనేత కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నగర నాయకులపై సీరియస్ అయినట్లు చెబుతున్నారు.

మల్కాజ్ గిరి, చేవేళ్ల, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి నియోజక వర్గాలలో పార్టీ నాయకులు ఎవరూ అభ్యర్దులకు సహరించటం లేదంటున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఉపయోగించుకోవటం లేదని, వారిపై సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

అలాగే తెలంగాణ మంత్రవర్గ విస్తరణ అనంతరం పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయిలో ఉందని, దాని కారణంగానే లోక్ సభ అభ్యర్దులకు ఎవరూ సహకరించటంలేదని అంటున్నారు. అన్ని లోక్ సభ స్థానాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పార్టీ నాయకుల పై సీరియస్ అయినట్లు సమాచారం. 16 స్థానాలలో గెలవాలనుకుంటున్న టిఆర్ఎస్… పరిస్థితి ఇలాగే ఉంటే సగం స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు.

First Published:  1 April 2019 5:12 AM IST
Next Story