Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ సినిమాలో కొత్త హీరోయిన్

త్వరలోనే హరీష్ శంకర్ తో కలిసి వాల్మీకి సెట్స్ పైకి రాబోతున్నాడు వరుణ్ తేజ్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఇప్పటికే కాస్త లావెక్కి, మేకోవర్ కూడా అవుతున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. వాల్మీకిలో మృణాళిని అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. రీసెంట్ గా తమిళనాట వచ్చిన […]

వరుణ్ తేజ్ సినిమాలో కొత్త హీరోయిన్
X

త్వరలోనే హరీష్ శంకర్ తో కలిసి వాల్మీకి సెట్స్ పైకి రాబోతున్నాడు వరుణ్ తేజ్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ఇప్పటికే కాస్త లావెక్కి, మేకోవర్ కూడా అవుతున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. వాల్మీకిలో మృణాళిని అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.

రీసెంట్ గా తమిళనాట వచ్చిన సూపర్ డీలక్స్ అనే సినిమాలో మృణాళిని ఓ చిన్న పాత్ర చేసింది. ఆ లుక్స్ నచ్చి వాల్మీకిలో కూడా హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ సరసన మృణాళిని నటించదు. సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్ సరసన ఆమె కనిపించబోతోంది. సిద్దార్థ్ స్థానంలో అధర్వను తీసుకున్న విషయం తెలిసిందే. అంటే వాల్మీకి సినిమాలో అధర్వ-మృణాళిని ఓ జంట అన్నమాట.

వరుణ్ తేజ్ సరసన నటించనున్న హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ నెలలోనే వాల్మీకి సెట్స్ పైకి రాబోతున్నాడు వరుణ్ తేజ్. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బయటకొస్తాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

First Published:  1 April 2019 1:17 PM IST
Next Story