Telugu Global
Cinema & Entertainment

కుక్క కనిపెట్టింది కానీ నాగార్జున కనిపెట్టలేదట

మజిలీ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న చిత్రం. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం రాబోయే శుక్రవారం నాడు విడుదల కానున్నది. పెళ్ళి తర్వాత మొదటి సారిగా ఈ ఇద్దరూ కలిసి నటించడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సినిమా లో కూడా వీళ్ళు ఇద్దరూ భార్య, భర్తల పాత్రలు పోషించడం తో అభిమానులకి సినిమా మీద ఎనలేని ఆసక్తి కలుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ […]

కుక్క కనిపెట్టింది కానీ నాగార్జున కనిపెట్టలేదట
X

మజిలీ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న చిత్రం. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం రాబోయే శుక్రవారం నాడు విడుదల కానున్నది. పెళ్ళి తర్వాత మొదటి సారిగా ఈ ఇద్దరూ కలిసి నటించడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సినిమా లో కూడా వీళ్ళు ఇద్దరూ భార్య, భర్తల పాత్రలు పోషించడం తో అభిమానులకి సినిమా మీద ఎనలేని ఆసక్తి కలుగుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనం గా జరిగింది. నాగార్జున అక్కినేని మరియు వెంకటేష్ దగ్గుబాటి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులు గా విచ్ఛేసారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే నాగార్జున స్పీచ్. ఈవెంట్ లో మాట్లాడుతూ తన కొడుకు కోడలు గురించి గొప్పగా చెప్పాడు నాగార్జున.

“ఏ మాయ చేసావే చూసినప్పుడు ఈ జంట బాగుంది అని అనుకున్నాను. కానీ అదేంటో గానీ తెర వెనుక వీరు రొమాన్స్ నడుపుతున్న విషయం అర్ధం చేసుకోలేక పోయాను. మనం సినిమా చేసేటప్పుడు కూడా నాకు ఆ విషయం అర్ధం కాలేదు. ఒకసారి సమంత మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో కుక్క వెళ్ళి సమంత తో ఆడుకుంది. దానికి తెలిసిన విషయం నాకు తెలియలేదు. మా మంచి అబ్బాయి కి మంచి కోడలు దొరికింది” అని నాగార్జున చెప్పారు.

First Published:  1 April 2019 4:58 AM IST
Next Story