కరివేపాకు.... కూరలోనే కాదు.... ఎక్కడా తీసేయకండి....
కూరలో కరివేపాకులా తీసి పారేశారు అని తరచూ వింటాం … కాని కూరలో కరివేపాకు చేసే మేలు అంతా…ఇంతా కాదు. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. కరివేపాకులో విటమిన్ ఎ, బి, బి2, సి ఇంకా ఈ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. రోజూ కూరల్లో వేసే కరివేపాకును పారేయకుండా తింటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. కరివేపాకు ఎనీమీయా…. అదే రక్తహీనతను దరికి చేరనివ్వదు. […]
BY sarvi1 April 2019 2:50 AM IST
X
sarvi Updated On: 1 April 2019 7:21 AM IST
కూరలో కరివేపాకులా తీసి పారేశారు అని తరచూ వింటాం … కాని కూరలో కరివేపాకు చేసే మేలు అంతా…ఇంతా కాదు. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది.
- కరివేపాకులో విటమిన్ ఎ, బి, బి2, సి ఇంకా ఈ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
- రోజూ కూరల్లో వేసే కరివేపాకును పారేయకుండా తింటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది.
- కరివేపాకు ఎనీమీయా…. అదే రక్తహీనతను దరికి చేరనివ్వదు.
- కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగస్ తో పోరాడే గుణం చాలా ఉంది. దీని కారణంగా కరివేపాకు అంటు వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.
- కరివేపాకులో జీర్ణశక్తి అధికంగా ఉంటుంది. ఈ కారణంగా మల బద్దకాన్ని నివారిస్తుంది.
- ప్రతిరోజు ఉదయాన్నే 4 లేక 5 కరివేపాకు ఆకుల్ని నమిలి ఆ రసాన్ని మింగితే డయాబిటీస్… మధుమేహ సమస్య ఉండనే ఉండదు.
- శ్లేష్మం, వాతం, పిత్తం.. ఈ మూడూ రుగ్మతలు కరివేపాకుతో మాయం అవుతాయి.
- కంటికి వచ్చే అరుదైన వ్యాధులు, దృష్టి లోపం ఉన్న వారు కరివేపాకు ఆకుల్ని తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
- చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర చర్మ సమస్యలతో బాధ పడుతున్నప్పుడు, కొద్దిగా కరివేపాకు పేస్ట్ ను చర్మ సమస్య ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
- కరివేపాకులో రోగ నిరోధక శక్తి అపారం.
- కరివేపాకు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా కాపాడుతుంది.
- కరివేపాకు పేస్ట్ లో కొద్దిగా వేప ఆకు పేస్ట్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది.
- కొబ్బరినూనెలో కొన్నికరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగొట్టి వారానికి నాలుగు సార్లు తలకు పట్టిస్తే కుదుళ్లు గట్టి పడి జుట్టు రాలడం తగ్గుతుంది.
- కరివేపాకులో బరువును అదుపు చేసే గుణం కూడా ఉంది.
- మొటిమలతో బాధపడుతున్నవారు కరివేపాకు పేస్ట్ ను మొటిమలపై అద్దీ…. ఎండిన తర్వాత కడిగేసుకుంటే కొద్ది రోజుల తర్వాత మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.
- కరివేపాకు పచ్చడి, పొడి వంటివి వారానికి రెండు లేక మూడు సార్లు ఆహరంతో పాటు తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.
- ఇక కూరలు, పచ్చళ్లల్లో పోపు… తాలింపుల్లో వేసే కరివేపాకును పక్కన పడేయకూడదు. ఆ కరివేపాకు ఆకుల్ని తింటే అందానికి అందం…. ఆరోగ్యానికి ఆరోగ్యం.
Next Story