Telugu Global
NEWS

సన్నిహితుల వద్ద వాపోయిన ఏపీ సీఎస్ పునీత ?

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వర రావును తప్పించే అంశంలో జరిగిన డ్రామా ఇప్పుడు ఏపీ సీఎస్‌ అనిల్‌ చంద్ర పునీత మెడకు చుట్టుకుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత, ఈసీ పరిధిలో పనిచేయాల్సిన సీఎస్…. అందుకు విరుద్దంగా పనిచేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే అంతా జరిగిందని అందరికీ తెలిసినా టెక్నికల్‌గా సీఎస్ ఇరుకున్నారు. వివాదాస్పద ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయగానే… తొలుత అందుకు […]

సన్నిహితుల వద్ద వాపోయిన ఏపీ సీఎస్ పునీత ?
X

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వర రావును తప్పించే అంశంలో జరిగిన డ్రామా ఇప్పుడు ఏపీ సీఎస్‌ అనిల్‌ చంద్ర పునీత మెడకు చుట్టుకుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత, ఈసీ పరిధిలో పనిచేయాల్సిన సీఎస్…. అందుకు విరుద్దంగా పనిచేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.

చంద్రబాబు ఒత్తిడితోనే అంతా జరిగిందని అందరికీ తెలిసినా టెక్నికల్‌గా సీఎస్ ఇరుకున్నారు. వివాదాస్పద ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయగానే… తొలుత అందుకు తగ్గట్టే జీవో నెంబర్‌ 716 జారీ చేశారు.

కానీ ఆరోజు రాత్రే సీఎస్ ను చంద్రబాబు పిలిపించుకుని ఒత్తిడి చేయడంతో ఏబీ బదిలీని రద్దు చేస్తూ జీవోలు 720, 721 జారీ అయ్యాయి.

ఈసీ పరిధిలో పనిచేస్తున్న సమయంలో ఈసీకి చెప్పకుండా సీఎస్ ఈ జీవో జారీ చేశారు. దాంతో ఆయన్ను సీఈసీ ఢిల్లీ పిలిపించుకుని వివరణ కోరింది. గంట పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌… ఏపీ సీఎస్‌ను ప్రశ్నించారు.

ఎందుకు ఇలా జీవో జారీ చేశారని ఈసీ ప్రశ్నించింది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? విపరీత నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని వివరణ కోరారు.

గంట పాటు సమావేశం తర్వాత బయటకు వచ్చిన సీఎస్ అనిల్ పునీత… మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.

తాను ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈసీకి చెప్పకుండా జీవో జారీ చేయకూడదన్న విషయం తనకూ తెలుసని.. కానీ ముఖ్యమంత్రి ఒత్తిడిని భరించలేక ఆ పని చేయాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద సీఎస్ వాపోయారు.

First Published:  1 April 2019 9:30 AM IST
Next Story