Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాలలో రైతు పార్టీ...?

తెలుగు రాష్ట్రాలలో మరో రాజకీయ పార్టీ రానుందా? ఫక్తు రాజకీయ పార్టీలా కాకుండా రైతు ప్రయోజనాలే ప్రధానంగా మరో పార్టీ రానుందా..? ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత ఓ కొత్త రైతు రాజకీయ పార్టీ వెలుగు చూస్తుందా..? అంటే…. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమకు జరిగిన అన్యాయానికి, జరుగుతున్న మోసానికి నిజామాబాద్ జిల్లా రైతులు నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్రులుగా నామినేషన్ వేసారు. ఏకంగా 185 మంది రైతులు […]

తెలుగు రాష్ట్రాలలో రైతు పార్టీ...?
X

తెలుగు రాష్ట్రాలలో మరో రాజకీయ పార్టీ రానుందా? ఫక్తు రాజకీయ పార్టీలా కాకుండా రైతు ప్రయోజనాలే ప్రధానంగా మరో పార్టీ రానుందా..? ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత ఓ కొత్త రైతు రాజకీయ పార్టీ వెలుగు చూస్తుందా..? అంటే…. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తమకు జరిగిన అన్యాయానికి, జరుగుతున్న మోసానికి నిజామాబాద్ జిల్లా రైతులు నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్రులుగా నామినేషన్ వేసారు. ఏకంగా 185 మంది రైతులు నిజామాబాద్ ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఎన్నికల నిర్వహణ…. ఎన్నికల కమీషన్ కు తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినా రైతులెవ్వరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు.

అయితే తాజాగా రైతులు తీసుకున్ననిర్ణయం అందరినీ ఆలోచింప చేస్తోంది. నిజామాబాద్ ఎన్నికల బరిలో 185 మంది అభ్యర్దులు కాకుండా అందరి తరఫున ఒక్కరినే బరిలో నిలపాలని నిర్ణయించుకున్నారు. ఈ చర్య ద్వారా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల నుంచి సానుభూతి పొందాలన్నది రైతుల ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

అలాగే తమ సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికల బరిలో నిలవడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయ శక్తిగా ఎదగాలని రైతులు తీర్మానించుకున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాలలో రైతులందరినీ సమీకరించడం, వారి తరఫున ఉద్యమించడం వంటివి చేయాలని రైతులు తీర్మానించుకున్నారు.

రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఉత్తారాది రాష్ట్రాలలో రైతులను కూడా తమ పార్టీకి మద్దతు తెలిపేలా వారిని కలవాలని తీర్మానించారు. కేవలం రైతుల కోసమే పుట్టిన పార్టీగా ఈ కొత్త రాజకీయ శక్తిని ప్రజలలోకి తీసుకు వెళ్ళాలనేది నిజామాబాద్ రైతుల ఉద్దేశ్యం.

First Published:  31 March 2019 6:23 AM IST
Next Story