Telugu Global
NEWS

ముసుగు తీసిన తానా... బాబుకు తందానా...

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) తన రాజకీయ రంగును బహిర్గతం చేసింది. తొలి నుంచి కూడా ఈ సంఘం టీడీపీకి అనుబంధ అమెరికా సంఘంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక సామాజికవర్గం వారి ఆధిపత్యమే ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. తానా అధ్యక్షుడిగా ఉన్న వేమన సతీష్…. చంద్రబాబుకు, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ రాజకీయంగా టీడీపీకి వంతపాడేందుకు సిద్దమై తన అసలు రంగు బయటపెట్టింది. టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని తానా కోరుకుంటోందని నార్త్ […]

ముసుగు తీసిన తానా... బాబుకు తందానా...
X

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) తన రాజకీయ రంగును బహిర్గతం చేసింది. తొలి నుంచి కూడా ఈ సంఘం టీడీపీకి అనుబంధ అమెరికా సంఘంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక సామాజికవర్గం వారి ఆధిపత్యమే ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. తానా అధ్యక్షుడిగా ఉన్న వేమన సతీష్…. చంద్రబాబుకు, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేశారు.

ఇప్పుడు ఈ సంస్థ రాజకీయంగా టీడీపీకి వంతపాడేందుకు సిద్దమై తన అసలు రంగు బయటపెట్టింది. టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని తానా కోరుకుంటోందని నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం చెప్పారు. తానా సభ్యులతో కలిసి తాము టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేస్తామని చెప్పారు.

కోమటి జయరాం… టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావును కలిసి మద్దతు తెలిపారు. టీడీపీకి తానా మద్దతు ప్రకటించడం ద్వారా ఆ సంస్థ టీడీపికి అమెరికాలో అనుబంధ సంస్థ అన్న పేరును ఖాయం చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజికవర్గం కోణంలోనే తానా … చంద్రబాబు కోసం తపిస్తోందని అమెరికాలోని ఇతర తెలుగువారు అభిప్రాయపడుతున్నారు.

First Published:  31 March 2019 6:51 AM IST
Next Story