కేంద్రంలో అధికారానికి దక్షిణాదే పునాది..!
దేశంలో ఎన్నికల వేడి తారాస్ధాయికి చేరింది. నాలుగైదు విడతలుగా జరగనున్న ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలోనే తొలివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 42 ఇతర దక్షిణాది రాష్ట్రాలలో 100 కు పైగా లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు తక్కువే అయినా…. […]
దేశంలో ఎన్నికల వేడి తారాస్ధాయికి చేరింది. నాలుగైదు విడతలుగా జరగనున్న ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలోనే తొలివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 42 ఇతర దక్షిణాది రాష్ట్రాలలో 100 కు పైగా లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు తక్కువే అయినా…. కేంద్రంలో అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయించేది మాత్రం దక్షిణాది రాష్ట్రాలే అంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రాంతీయ పార్టీలదే హావా. ఇక కేరళలో మాత్రం వామపక్ష పార్టీ అయిన సీపీఎం, జాతీయా పార్టీలైన బిజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తోంది.
దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తాయి… వారి మద్దతు ఎవరికి ఉంటుంది అన్నదే ప్రధాన చర్చగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మద్దతే కీలకం కానుంది. అంకెల గారడీకే ప్రాధాన్యం ఉన్న నేటి తరుణంలో దక్షిణాది రాష్ట్రాలలో గెలిచిన పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పనున్నాయి. ఒక విధంగా ఇన్నాళ్లూ ఉత్తరాది పెత్తనంలో నలిగిన దక్షిణాది వారికి ఇది మంచి తరుణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.