సార్ వస్తున్నారు.... డిపాజిట్ లైనా దక్కుతాయా?
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఆంధ్రప్రదేవ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారు. ముందుగానే నిర్ణయించిన షేడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ పర్యటన లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు. రఘువీరా రెడ్డి పోటీ చేసే అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గంలోను, విజయవాడలోను రాహుల్ […]
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఆంధ్రప్రదేవ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారు. ముందుగానే నిర్ణయించిన షేడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ పర్యటన లేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు. రఘువీరా రెడ్డి పోటీ చేసే అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గంలోను, విజయవాడలోను రాహుల్ గాంధీ బహిరంగ సభలలో పాల్గొంటారు. రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ పర్యటన బొత్తిగా ఇష్టం లేకపోయినా స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు ఆయన పర్యటిస్తున్నట్లు చెబుతున్నారు.
సారు వస్తున్నారు కాని… ఈ ఎన్నికలలో డిపాజిట్లు అయినా దక్కుతాయా అనే అనుమానం పార్టీ నాయకులను వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 175 శాసన సభ స్థానాలకు, 25 లోక్ సభ స్దానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. పార్టీలో మిగిలిన సీనియర్ నాయకులందరినీ ఈ ఎన్నికల బరిలో దింపారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. కొన్ని చోట్ల పవన్ కల్యాణ్ జనసేన ఎన్నికల బరిలో ఉన్నా ఆ పార్టీ ఓట్లు చీల్చడమే చేస్తుందంటున్నారు. ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీది నాలుగో స్థానమే. అదికూడా డిపాజిట్లు దక్కె పరిస్ధితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.