భీమవరం రౌడీలంటూ సీమలో టీడీపీ ప్రచారం
వైసీపీకి ఓటేస్తే గోదావరి జిల్లాల్లోకి రాయలసీమ రౌడీలు వస్తారని ప్రచారం చేసిన టీడీపీ…. ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. రాయలసీమ పేరుతో ఆంధ్రా ప్రాంతంలో ప్రజలను రెచ్చగొడుతున్న టీడీపీ ఇప్పుడు భీమవరం రౌడీలు అంటూ సీమలో ప్రజలను రెచ్చగొట్టేందుకు దిగింది. మంత్రి కాలువ శ్రీనివాసులు ఏకంగా భీమవరం రౌడీలు వచ్చారంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. తాను పోటీ చేస్తున్న రాయదుర్గం నియోజవర్గంలో అశాంతి సృష్టించేందుకు భీమవరం రౌడీల బ్యాచ్ వచ్చిందంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయం పత్రికల్లో మెయిన్ ఎడిషన్ లో రాలేదు […]
వైసీపీకి ఓటేస్తే గోదావరి జిల్లాల్లోకి రాయలసీమ రౌడీలు వస్తారని ప్రచారం చేసిన టీడీపీ…. ఇప్పుడు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. రాయలసీమ పేరుతో ఆంధ్రా ప్రాంతంలో ప్రజలను రెచ్చగొడుతున్న టీడీపీ ఇప్పుడు భీమవరం రౌడీలు అంటూ సీమలో ప్రజలను రెచ్చగొట్టేందుకు దిగింది.
మంత్రి కాలువ శ్రీనివాసులు ఏకంగా భీమవరం రౌడీలు వచ్చారంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. తాను పోటీ చేస్తున్న రాయదుర్గం నియోజవర్గంలో అశాంతి సృష్టించేందుకు భీమవరం రౌడీల బ్యాచ్ వచ్చిందంటూ ఫిర్యాదు చేశారు.
ఈ విషయం పత్రికల్లో మెయిన్ ఎడిషన్ లో రాలేదు కానీ… మార్చి 30న టీడీపీ అనుకూల ప్రతిక అనంతపురం జిల్లా ఎడిషన్‌లో మాత్రం మొదటిపేజీలోనే ప్రచురించింది.
వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తరపున భీమవరం రౌడీలు వచ్చారని ఫిర్యాదు చేశారు కాలువ. తన ప్రతి కదలికను భీమవరం రౌడీల బ్యాచ్ గమనిస్తోందని… అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కాలువ ఫిర్యాదు చేశారు.