Telugu Global
NEWS

కొందరు బయటకు రావడం లేదు అంతే... జగన్‌కు ఇండస్ట్రీలో 80 శాతం మంది సపోర్టు

జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా మంచి పనులు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని జయసుధ చెప్పారు. జగన్ తొమ్మిదేళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులు ఒక పెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించారు. వాటిని ఎదుర్కొని నిలబడ్డ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తేనే కదా జగన్‌ ఏం చేస్తారన్నది తెలిసేది అని జయసుధ అభిప్రాయపడ్డారు. రైతులకు, పేదలకు జగన్‌ సీఎం అయితేనే మంచి జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి రైతులకు, ప్రజలకు ఏంత మంచి చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో మార్పు కూడా […]

కొందరు బయటకు రావడం లేదు అంతే... జగన్‌కు ఇండస్ట్రీలో 80 శాతం మంది సపోర్టు
X

జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా మంచి పనులు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని జయసుధ చెప్పారు. జగన్ తొమ్మిదేళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులు ఒక పెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించారు. వాటిని ఎదుర్కొని నిలబడ్డ జగన్‌కు ఒక్క అవకాశం
ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తేనే కదా జగన్‌ ఏం చేస్తారన్నది తెలిసేది అని జయసుధ అభిప్రాయపడ్డారు.

రైతులకు, పేదలకు జగన్‌ సీఎం అయితేనే మంచి జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి రైతులకు, ప్రజలకు ఏంత మంచి చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో మార్పు కూడా చాలా అవసరమైన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయన్నారు.

చంద్రబాబుకు అనుభవం ఉండవచ్చు గానీ… ఆ అనుభవం ఈ ఐదేళ్లలో పనికి రాలేదన్నది తన అభిప్రాయం అన్నారు. చిత్రపరిశ్రమకు వైఎస్ ఎంతో చేశారన్నారు. కాబట్టి ఈ సమయంలో ఆయన కుమారుడికి మొత్తం పరిశ్రమ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే చాలా మంది మద్దతు ఇస్తున్నారని… మరికొందరు లోలోన మద్దతు ఇస్తున్నారన్నది తనకు అనిపిస్తోందన్నారు. జగన్‌కు మద్దతుగా నిలవడం సినిమా వాళ్ల కనీస ధర్మమన్నారు. జగన్‌కు చిత్రపరిశ్రమలో ఉండాల్సిన సపోర్టు ఉందన్నారు. బయటకు కొందరు కనిపించకపోయినా జగన్‌కు చిత్రపరిశ్రమలో 80 శాతం మంది మద్దతు ఉందన్నారు.

సినిమా వాళ్లను బలవంత పెట్టి రాజకీయాలు చేయించే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదన్నారు. వైసీపీలోకి ఎవరొచ్చినా వారి వెనుక కేసీఆర్‌ హస్తముందని పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. ఈ పుకార్లన్నీ టీడీపీ వాళ్లే సృష్టిస్తున్నారని జయసుధ విమర్శించారు. అలీ 20 ఏళ్లు టీడీపీ కోసం పనిచేశారని.. కానీ ఒక్క పదవి గానీ, ఒక పోస్టు గానీ ఇవ్వకుండా అవమానించారన్నారు జయసుధ.

First Published:  31 March 2019 8:08 AM GMT
Next Story