ఉభయ గోదావరిలో పందాలు జోరు..!
ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. అభ్యర్దులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ విజయం చేజిక్కించుకుంటుందని కొందరు…. ఈ సారి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించి తీరుతుందని మరికొందరు పందాలు కాసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఈ పందాల జోరు మరింత ఎక్కువగా ఉంది. అయితే అధికార పార్టీపై పందాలు కాసేవారు తక్కువగానే ఉన్నారని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల పందాల హోరు ఎక్కువైందని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి […]
ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. అభ్యర్దులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ విజయం చేజిక్కించుకుంటుందని కొందరు…. ఈ సారి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించి తీరుతుందని మరికొందరు పందాలు కాసుకుంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలలో ఈ పందాల జోరు మరింత ఎక్కువగా ఉంది. అయితే అధికార పార్టీపై పందాలు కాసేవారు తక్కువగానే ఉన్నారని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల పందాల హోరు ఎక్కువైందని చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 10 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పందం రాయుళ్లు బెట్లు కడుతున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 19 స్థానాలలో 12 స్దానాల నుంచి 15 సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పందాలు జరుగుతున్నట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ బెట్టింగులకు, కోడి పందాలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలో కోట్లాది రూపాయలు పందాల రూపంలో చేతులు మారుతాయి. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సారి చాలా తక్కువ స్థానాలలో గెలుస్తుందని పందెం రాయుళ్లు బెట్టింగులు కడుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లక్ష రూపాయలు పందం కాస్తే.. అదే తెలుగుదేశం గెలిస్తే 6 లక్షల రూపాయలు ఇస్తామని పందాలు కడుతున్నట్లు సమాచారం. దీనిని బెట్టింగ్ పరిభాషలో ఒకటి…. ఆరు పందెంగా వ్యవహరిస్తారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ స్థాయిలో పందాలు లేకపోయినా లక్షకు… లక్ష పందాలు కాస్తున్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పందాలు కాస్తున్నవారు మాత్రం తక్కువగానే ఉండడం కొసమెరుపు.