దొరసాని ప్రచారం ప్రారంభమైంది
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే ఊపులో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా కూడా సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంది. ఎట్టకేలకు ఆ మూవీ ప్రచారాన్ని అధికారికంగా స్టార్ట్ చేశారు. ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న సినిమా దొరసాని. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. నిర్మాత మధుర శ్రీధర్ ఈ పోస్టర్ ను ఆవిష్కరించాడు. […]

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే ఊపులో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆ సినిమా కూడా సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంది. ఎట్టకేలకు ఆ మూవీ ప్రచారాన్ని అధికారికంగా స్టార్ట్ చేశారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న సినిమా దొరసాని. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. నిర్మాత మధుర శ్రీధర్ ఈ పోస్టర్ ను ఆవిష్కరించాడు. ఇదే సినిమాలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయమౌతున్న విషయం తెలిసిందే.
బిగ్ బెన్ మూవీస్, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది దొరసాని. తాజాగా ఈ ప్రాజెక్టులోకి సురేష్ బాబు కూడా సహనిర్మాతగా ఎంటరయ్యారు. తెలంగాణలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా మొత్తం తెలంగాణలోనే చిత్రీకరించారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ వరంగల్ లో పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్ లోకి హీరో విజయ్ దేవరకొండను కూడా దించబోతున్నారు.