Telugu Global
International

భారత్‌పై నిఘా పెట్టిన అమెరికా..?

ఉపగ్రహాలను సైతం కూల్చే సాంకేతికతను అభివృద్ది చేసిన భారత సైంటిస్టులు.. నిన్న ఆ యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఏశాట్ ద్వారా చేసిన ఈ ప్రయోగం విజయంతం కావడంపై ఇతర దేశాలు పెద్దగా అభ్యంతరం చేయలేదు. కాని అమెరికా మన ప్రయోగాన్ని అభినందిస్తూనే నిఘాను పెట్టింది. శాటిలైట్లను కూల్చే నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించడంతో నిన్న అమెరికా బంగాళాఖాతంపైకి ఆర్‌సీ-135 కోబ్రాబాల్ అనే ప్రత్యేక […]

భారత్‌పై నిఘా పెట్టిన అమెరికా..?
X

ఉపగ్రహాలను సైతం కూల్చే సాంకేతికతను అభివృద్ది చేసిన భారత సైంటిస్టులు.. నిన్న ఆ యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఏశాట్ ద్వారా చేసిన ఈ ప్రయోగం విజయంతం కావడంపై ఇతర దేశాలు పెద్దగా అభ్యంతరం చేయలేదు. కాని అమెరికా మన ప్రయోగాన్ని అభినందిస్తూనే నిఘాను పెట్టింది.

శాటిలైట్లను కూల్చే నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించడంతో నిన్న అమెరికా బంగాళాఖాతంపైకి ఆర్‌సీ-135 కోబ్రాబాల్ అనే ప్రత్యేక నిఘా విమానాన్ని పంపింది. భారత్ యాంటీ శాటిలైట్ క్షపణిని పరీక్షించిన కొన్ని గంటల్లోనే ఈ కోబ్రాబాల్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఈ విమానం ఏవైనా పేలుళ్లు, లేదా క్షిపణి ప్రయోగాలు జరిగినప్పుడు లభించే డేటాను సమీకరిస్తుంది. దాన్ని విశ్లేషించడం ద్వారా అది అమెరికాకు ముప్పా కాదా అని తెలుసుకుంటుంది.

అమెరికా వద్ద మూడు విమానాలు ఇలాంటివి ఉండగా దానిలో ఒకటి హిందూ మహాసముద్రంలోని వారి సైనికస్థావరమైన డిగోగార్సియాలో మోహరించింది. ఇది ఎక్కువగా ఇరాన్, ఉత్తరకొరియాల అణు పరీక్షల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. కాని తాజాగా భారత్ చేసిన పరీక్షపై కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మొత్తం అమెరికాలోని ఎన్ఎస్ఏ, డిఫెన్స్ సెక్రటరీకి చేరతాయి. తదనంతరం అది తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తుంది.

అయితే తాజ ప్రయోగంపై అమెరికా అభ్యంతరం చెప్పలేదు.. దాన్ని శత్రుదేశాలపై ప్రయోగించట్లేదని కూడా భారత్ చెప్పడంతో అమెరికా మిన్నకుండింది. కాని తెరవెనుక మాత్రం దాని నిఘాను కొనసాగిస్తోంది. అయితే ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

First Published:  28 March 2019 6:36 AM GMT
Next Story