ఫరూఖ్ అబ్ధుల్లా పై వైసీపీ పరువునష్టం దావా
గెలుపు పై చంద్రబాబుకు నమ్మకం సడలడంతో అన్నిరకాల ప్రయత్నాలనూ చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి జాతీయ నాయకులను ఆంధ్రాకి పిలిపించి వాళ్ళచేత జగన్ మీద తీవ్ర విమర్శలు చేయించడం. అందుకోసం చంద్రబాబు జాతీయ నాయకుల మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. వాళ్ళు వచ్చేస్తున్నారని మీడియా కూడా ప్రచారం చేస్తోంది. అయితే చంద్రబాబు తరపున ప్రచారం చేయడానికి కొందరు అంగీకరించడం లేదు. మరికొందరేమో మేము వచ్చి ప్రచారం చేస్తే గానీ గెలిచే పరిస్థితి లేదా? అని వ్యంగ్యంగా అడుగుతున్నారు. […]
గెలుపు పై చంద్రబాబుకు నమ్మకం సడలడంతో అన్నిరకాల ప్రయత్నాలనూ చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి జాతీయ నాయకులను ఆంధ్రాకి పిలిపించి వాళ్ళచేత జగన్ మీద తీవ్ర విమర్శలు చేయించడం. అందుకోసం చంద్రబాబు జాతీయ నాయకుల మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. వాళ్ళు వచ్చేస్తున్నారని మీడియా కూడా ప్రచారం చేస్తోంది.
అయితే చంద్రబాబు తరపున ప్రచారం చేయడానికి కొందరు అంగీకరించడం లేదు. మరికొందరేమో మేము వచ్చి ప్రచారం చేస్తే గానీ గెలిచే పరిస్థితి లేదా? అని వ్యంగ్యంగా అడుగుతున్నారు.
అలా చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఫరూఖ్ అబ్ధుల్లాను కడప ఎన్నికల సభలలో తనతోపాటు చంద్రబాబు తిప్పాడు. ఆయనచేత మాట్లాడించాడు. అంతవరకు బాగానే ఉంది గానీ…. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ నే ఫరూఖ్ అబ్ధుల్లా చదివాడంటున్నారు. దాంతో ఫరూఖ్ అబ్ధుల్లా తీవ్ర వివాదంలో కూరుకుపోయాడు. ఆయన ఏమన్నాడంటే…. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కాంగ్రెస్ కు 1500 కోట్ల రూపాయలు ఇవ్వజూపాడు…. అన్నాడు.
దీనిపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. ఆయనపై పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. అయితే తరువాత ఫరూఖ్ అబ్ధుల్లా కు విషయం అర్థమైనట్లుంది. తను ఎంత పొరపాటుగా మాట్లాడాడో తెలుసుకున్నాక జగన్‌కి ఫోన్ చేసి అలా మాట్లాడినందుకు, అలాంటి ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు కోరినట్టు సమాచారం.
ఫరూఖ్ అబ్ధుల్లా ఇలా మాట్లాడడం పై కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడింది. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని ఫరూఖ్ అబ్ధుల్లాను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హెచ్చరించాడు. కాంగ్రెస్ పార్టీకే తెలియకుండా ఈయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.