బయటపడ్డ డొల్లతనం
ఏపీ ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఈసీ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం… ఈసీ పరిధిలో ఇంటెలిజెన్స్ చీఫ్ లేరని వాదించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ కు ముందే సెక్షన్ 28ఏ కింద … ఎన్నికల విధుల్లోకి వచ్చే అధికారుల జాబితాను ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరగా… ఏపీ ప్రభుత్వం ఒక జాబితాను పంపింది. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు కూడా ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఎన్నికల విధుల్లో ఉంటారని… ఈసీ పరిధిలోకి వస్తారంటూ […]
ఏపీ ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఈసీ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం… ఈసీ పరిధిలో ఇంటెలిజెన్స్ చీఫ్ లేరని వాదించింది.
అయితే ఎన్నికల షెడ్యూల్ కు ముందే సెక్షన్ 28ఏ కింద … ఎన్నికల విధుల్లోకి వచ్చే అధికారుల జాబితాను ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరగా… ఏపీ ప్రభుత్వం ఒక జాబితాను పంపింది. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు కూడా ఉంది.
ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఎన్నికల విధుల్లో ఉంటారని… ఈసీ పరిధిలోకి వస్తారంటూ జాబితాను పంపింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు మాత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఈసీ పరిధిలోకి వస్తారని జాబితా పంపిన ప్రభుత్వం… ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రారు అంటూ ఏపీ ప్రభుత్వం వాదించడంపై ఈసీ తరపున న్యాయవాది అభ్యంతరం తెలియచేశారు.
దీంతో హైకోర్టు కూడా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో కంగుతిన్న ప్రభుత్వ లాయర్… తాము పొరపాటున ఇంటెలిజెన్స్ చీఫ్ పేరును పంపామని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ లేకుండా పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందని… ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుందని ఈసీ తరపున న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.