Telugu Global
Health & Life Style

రక్తహీనత.... ఇది జబ్బు కాదు

ఎనీమియా.. రక్తహీనత… శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలు తగ్గిపోతే దానినే రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. పైకి కనిపించని తీవ్ర రుగ్మతలలో రక్తహీనత ఒకటి. చూడడానికి ఏ రోగం లేనట్టుగా కనిపించినా మనిషిని లోలోపల తినేసే వ్యాధే ఈ ఎనీమియా. పురుషుల కంటే మహిళలను ఎక్కువగా వేధించే ఈ రక్తహీనతను ముందుగా తెలుసుకోకపోతే అనేక రుగ్మతలకు కారణం అవుతుంది.  రక్తంలో హీమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసుకుందాం… శరీరంలో 100 గ్రాముల రక్తం ఉందనుకుంటే అందులో.. మగవారిలో 13 […]

రక్తహీనత.... ఇది జబ్బు కాదు
X

ఎనీమియా.. రక్తహీనత… శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలు తగ్గిపోతే దానినే రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. పైకి కనిపించని తీవ్ర రుగ్మతలలో రక్తహీనత ఒకటి. చూడడానికి ఏ రోగం లేనట్టుగా కనిపించినా మనిషిని లోలోపల తినేసే వ్యాధే ఈ ఎనీమియా.

పురుషుల కంటే మహిళలను ఎక్కువగా వేధించే ఈ రక్తహీనతను ముందుగా తెలుసుకోకపోతే అనేక రుగ్మతలకు కారణం అవుతుంది.

రక్తంలో హీమోగ్లోబిన్ ఎంత ఉండాలో తెలుసుకుందాం…

  • శరీరంలో 100 గ్రాముల రక్తం ఉందనుకుంటే అందులో.. మగవారిలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరం లోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీలలో 11 గ్రాములు హీమోగ్లోబిన్ ఉండాలి. రక్తంలో ఈ మోతాదు తగ్గితే రక్త హీనత ప్రారంభమైనట్లు భావించాలి.
  • రక్తహీనతకు గురైన వారి శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది తెలియాలంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా రక్తంలో ఎన్ని ఎర్ర రక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు.
  • రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్‌ ఒక డెసి లీటర్‌కు 12 గ్రాముల నుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్‌బిసి కౌంట్‌ ఒక మైక్రోలీటర్‌కు 4.4 నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది.
  • పౌష్టికాహారం తీసుకోకపోవడమే రక్త హీనతకు ప్రధాన కారణమని వైద్యశాస్త్రం చెబుతోంది. ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండే తోటకూర, గోంగూర లతో పాటు బెల్లం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో కూడా రక్తహీనత సమస్య రాదని చెబుతున్నారు.
  • మహిళలు రుతుస్రావం ద్వారా ప్రతినెల అధికంగా రక్తన్ని కోల్పోతారు.అలాగే పిల్లలు కడుపులో నట్టల వల్ల, మలంలో రక్తం పడటం వల్ల ఈ రక్తహీనత బారినపడతారు.
  • మలేరియా జ్వరం బారిన పడిన వారి రక్తంలో ఎర్ర కణాలు ధ్వంసం అవుతాయి. తిరిగి అవి పెరగకపోవడం, రక్త కణాల ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.

రక్తహీనత లక్షణాలు

  • నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోతాయి. ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోవడంతో పాటు చిరాకు ఎక్కువవుతుంది.
  • ఆకలి మందగించడం… కళ్ళు తిరగడం… అరచేతుల్లో చెమట.. పాదాల్లో నీరు చేరడం… వంటివి ప్రధాన లక్షణాలు.
  • రక్తహీనతతో బాధపడే చిన్నారులు చదువులో అశ్రద్ధ కనబరుస్తారు. ఆటల్లో అనాసక్తి, నిరంతరంగా నీరసంగా ఉంది అని చెబుతూంటారు.

రక్తహీనత… చికిత్సా

  • ముందుగా దీనిని ఓ వ్యాధిగా గుర్తించకూడదు. రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే.
  • ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి.
  • యుక్తవయసులో అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనిచ్చే మహిళల వరకూ అందరికీ ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ఇవ్వాలి.
  • ఆహారంలో ఐరెన్ ఉండే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌ను నిత్యం తీసుకోవాలి.
  • మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.
  • రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది.
  • బీట్‌రూట్ లో ఐరన్, ప్రొటీన్‌ లు ఎక్కువగా ఉంటాయి.ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది.
  • నువ్వులు… రక్తహీనత తగ్గడానికి చాలా ఉపయోగపడే ఆహారం. వీటిని పాలలో నానబెట్టి కాని… బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బెల్లం, వేరుసెనగ పప్పు కలిపి తిన్నా మంచిది.
  • తేనెలో… ఐరన్, కాపర్, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగితే చాలా బలం. అయితే మధుమేహం వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోరాదు.
  • పళ్లు… ముఖ్యంగా.. అరటిపళ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ రక్తహీనత నివారణకు ఉపకరిస్తాయి. ఇక కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు.
First Published:  28 March 2019 6:00 AM IST
Next Story