టీడీపీని ఇబ్బంది పెడుతున్న బుద్దా వీడియో
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడంపై చంద్రబాబు రక్తం మరిగిపోతోంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న దానికి నిదర్శనంగా వైసీపీ ఒక వీడియోను బయటపెట్టింది. దేవినేని అవినాష్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని ఇటీవల బుద్దా వెంకన్న ఒక మీటింగ్‌లో చెప్పారు. తాము వెళ్లి ఏబీ వెంకటేశ్వరరావును కోరగానే ఆయన వెళ్లి చంద్రబాబుకు చెప్పగానే వెంటనే అవినాష్‌ను తెలుగు […]
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడంపై చంద్రబాబు రక్తం మరిగిపోతోంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న దానికి
నిదర్శనంగా వైసీపీ ఒక వీడియోను బయటపెట్టింది.
దేవినేని అవినాష్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని ఇటీవల బుద్దా వెంకన్న ఒక మీటింగ్‌లో చెప్పారు. తాము వెళ్లి ఏబీ వెంకటేశ్వరరావును కోరగానే ఆయన వెళ్లి చంద్రబాబుకు చెప్పగానే వెంటనే అవినాష్‌ను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారని బుద్దా వెంకన్న చెప్పారు. బుద్దా వెంకన్న మాటలే ఏబీ తీరుకు నిదర్శనమని వైసీపీ నేతలంటున్నారు.
మరోవైపు… ఏబీ వెంకటేశ్వరరావు లా అండ్ ఆర్డర్ కంటే టీడీపీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి చెప్పారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు చూశానని… ఎవరిని టీడీపీలోకి తీసుకోవాలి అనే అంశాన్ని నిర్ణయించేది ఏబీ వెంకటేశ్వరరావేనని ఎస్వీమోహన్ రెడ్డి వివరించారు.
నేతలను చేర్చుకోవడం దగ్గర నుంచి…. టీడీపీ అభ్యర్థుల ఎంపిక వరకు అన్ని ఏబీ వెంకటేశ్వర రావే నిర్ణయించేవారని చెప్పారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రజల భద్రత కంటే టీడీపీకి సంబంధించిన రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.
కోడ్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును రోజూ కలిసేవారని… అలా కలవడం ఏమిటి అంటే సీఎం భద్రత పర్యవేక్షణకు వచ్చారని చెప్పుకునే వారని ఎస్వీమోహన్ రెడ్డి వివరించారు.