నిజామాబాద్ ఎన్నిక వాయిదా పడుతుందా? బ‌్యాలెట్ పేపర్‌తో జరుగుతుందా?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హీట్ ఓ రకంగా ఉంటే….నిజామాబాద్‌లో రాజకీయ వేడి మాత్రం మరో రకంగా ఉంది. ఇక్కడ 203 మంది నామినేషన్లు వేశారు. అయితే 13 మంది నామినేషన్లు తిరస్కరించారు. వీరిలో 182 మంది రైతులే నామినేషన్లు వేశారు. అయితే చివరకు నామినేషన్ల పరిశీలన తర్వాత 190 మంది బరిలో నిలిచారు. దీంతో ఇప్పుడు నిజామాబాద్ ఎన్నిక జరుగుతుందా? లేదా అనే టెన్షన్ పట్టుకుంది. నామినేషన్లు ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది. ఈ 190 […]
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హీట్ ఓ రకంగా ఉంటే….నిజామాబాద్‌లో రాజకీయ వేడి మాత్రం మరో రకంగా ఉంది. ఇక్కడ 203 మంది నామినేషన్లు వేశారు. అయితే 13 మంది నామినేషన్లు తిరస్కరించారు. వీరిలో 182 మంది రైతులే నామినేషన్లు వేశారు. అయితే చివరకు నామినేషన్ల పరిశీలన తర్వాత 190 మంది బరిలో నిలిచారు. దీంతో ఇప్పుడు నిజామాబాద్ ఎన్నిక జరుగుతుందా? లేదా అనే టెన్షన్ పట్టుకుంది.
నామినేషన్లు ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది. ఈ 190 మంది ఎవరూ ఉపసంహరించకుంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తొలిసారి రావడంతో ఏం జరుగుతుంది? ఎలా ఎన్నిక నిర్వహిస్తారనే విషయాన్ని అందరూ పరిశీలిస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో అభ్యర్ధులు బరిలో ఉండడంతో ఏం చేయాలనే విషయాన్ని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు.
190 మంది అభ్యర్థులు బరిలో ఉంటే….బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక జరగబోతుంది. అయితే బ్యాలెట్ పేపర్ ముద్రణకు సమయం పడుతుంది? బ‌్యాలెట్ బాక్స్‌ల సమీకరణకు కూడా టైమ్ కావాలి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ప్లోరైడ్ బాధితులు తమ సమస్యపై దేశం మొత్తం చర్చ జరగాలనే ఆలోచనతో 1996లో నల్కొండ లోక్‌సభ స్థానం నుంచి భారీగా నామినేషన్లు వేశారు. 486 మంది బరిలో దిగారు. దీంతో అధికారులు ఎన్నికను నెలరోజుల పాటు వాయిదా వేశారు. అప్పుడు ఈవీఎంలు లేవు. కాకపోతే పెద్ద సైజు బ్యాలెట్ ముద్రణతో పాటు బ్యాలెట్ బాక్స్‌ల తయారీ కోసం అధికారులు సమయం తీసుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ విషయంలో అధికారులు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.