29న లక్ష్మీ'స్ ఎన్టీఆర్.... అడ్డంకులు అధిగమించిన క్రమం ఇది!
లక్ష్మీస్ ఎన్టీఆర్…. ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతాన్ని లక్ష్మీపార్వతి కోణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఎదురవుతాయనే విషయాన్ని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు చాలా అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ సక్సెస్ ఫుల్ గా అధిగమించి ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పట్నుంచి, థియేటర్లలోకి వచ్చేంత వరకు ఈ సినిమా ఏ ఏ అడ్డంకుల్ని ఎలా అధిగమించిందో చూద్దాం… […]
లక్ష్మీస్ ఎన్టీఆర్…. ఎన్టీఆర్ వెన్నుపోటు ఉదంతాన్ని లక్ష్మీపార్వతి కోణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఎదురవుతాయనే విషయాన్ని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు చాలా అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ సక్సెస్ ఫుల్ గా అధిగమించి ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పట్నుంచి, థియేటర్లలోకి వచ్చేంత వరకు ఈ సినిమా ఏ ఏ అడ్డంకుల్ని ఎలా అధిగమించిందో చూద్దాం…
అడ్డంకి -1
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మొదటి అడ్డంకి దేవిబాబు చౌదరి రూపంలో ఎదురైంది. ఎన్నికల వేళ ఈ సినిమాను విడుదల చేస్తే తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, ఓటర్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు ఈ తెలుగుదేశం కార్యకర్త. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం, ఈ సినిమాపై ఏమైనా అభ్యంతరాలుంటే దాన్ని సెన్సార్ బోర్డు పరిశీలిస్తుందంటూ బోర్డుకు అప్పగించింది.
అడ్డంకి -2
సెన్సార్ బోర్డు పని కేవలం సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ ఉంటే తొలిగించడం లేదా మ్యూట్ చేయడం. అయితే ఎన్నికల వేళ ఈ సినిమాను ఆపే అధికారం దీనికి లేదు. అందుకే తమ అభ్యంతరాల్ని తెలుపుతూ, సదరు ఫిర్యాదును తిరిగి ఎన్నికల సంఘానికే పంపించింది.
అడ్డంకి -3
అలా మళ్లీ ఎన్నికల సంఘానికి చేరింది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫిర్యాదు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిని వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అలా ఎలక్షన్ కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరైన రాకేష్ రెడ్డి, సినిమాలో ఎవర్నీ కించపరిచేలా సన్నివేశాలు లేవని లిఖిత పూర్వకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని ఇందులో ఆవిష్కరించలేదని, కేవలం ఆయన రెండో భార్య చెప్పిన వివరాల ఆధారంగా తీశామని లేఖలో వెల్లడించాడు.
అడ్డంకి -4
అలా ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ అందుకుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లియరెన్స్ లెటర్ ను అందుకున్న సెన్సార్ బోర్డు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే ఇక్కడే తెలుగుదేశం పార్టీ పెద్దలు సెన్సార్ అధికారుల్ని ప్రభావితం చేయొచ్చంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
అడ్డంకి -5
కానీ, సెన్సార్ బోర్డు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా సినిమాను ఆసాంతం పరిశీలించిన బోర్డు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ‘క్లీన్-u’ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.
అడ్డంకి -6
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు వివిధ జిల్లాల్లోని నేతలు తెరవెనక ఇంకొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్ల పరిధిలో ఉన్న థియేటర్ల యజమానులకు బెదిరింపులు కూడా చేశారట. ఈ అడ్డంకిని కూడా అధిగమించింది లక్ష్మీస్ ఎన్టీఆర్ యూనిట్. తెలుగుదేశం జనాలు మేల్కొనకముందే థియేటర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది.
ఇలా అన్ని అడ్డంకుల్ని అధిగమించి దిగ్విజయంగా ఈనెల 29న థియేటర్లలోకి రాబోతోంది లక్ష్మీస్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది.