చంద్రబాబు అసహనం... అభ్యర్థుల నిర్వేదం!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడచిన కొన్ని రోజులుగా తీవ్ర అసహనంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు తన సభలకు వస్తున్న ప్రజలను, వారి ప్రతిస్పందన చూసిన తర్వాత ఆయా జిల్లాల నాయకుల వద్ద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజలను సమీకరించడం, పార్టీ ఏం చేసింది… భవిష్యత్తులో ఏం చేస్తుంది అనే విషయాలను వివరించడంలో జిల్లా […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడచిన కొన్ని రోజులుగా తీవ్ర అసహనంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు తన సభలకు వస్తున్న ప్రజలను, వారి ప్రతిస్పందన చూసిన తర్వాత ఆయా జిల్లాల నాయకుల వద్ద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రజలను సమీకరించడం, పార్టీ ఏం చేసింది… భవిష్యత్తులో ఏం చేస్తుంది అనే విషయాలను వివరించడంలో జిల్లా నాయకులు విఫలమవుతున్నారని చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుల వద్ద మండిపడుతున్నారని సమాచారం. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు జనం పోటెత్తడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు.
“తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నేనొక్కడినే కష్టపడడం, గొంతు చించుకుని ప్రసంగించడం సరిపోదు. మీ వంతుగా మీరు కృషి చేయాలి” అని జిల్లాల పర్యటనల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల నాయకులకు వివరిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలోనూ ఇదే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. పచ్చ మీడియాలో తమకు మద్దతుగా వార్తలు, కథనాలు వస్తున్నా తమ అధినేత చంద్రబాబులో మాత్రం అసహనం రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.
పార్టీ అధ్యక్షుడే ఇలా ఉంటే తాము మాత్రం ప్రచారంలో ఎలా దూసుకుపోతామని పార్టీ అభ్యర్థులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. “ ఎన్నికల ప్రచార సభలకు జనసమీకరణ చేయగలం. ప్రజలను బ్రతిమాలి, ప్రాధేయపడి, అవి ఇస్తాం… ఇవి ఇస్తాం అంటూ ప్రలోభ పెట్టి తీసుకు రాగలం. అధ్యక్షుడు ప్రసంగ సమయంలో ఇలా స్పందించండి.. అలా స్పందించండి అని ఎలా చెప్పగలం” అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోను, జాతీయ మీడియా సర్వేల్లోనూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రిపోర్టులు ఉండటంతో…. చంద్రబాబునాయుడులో రోజురోజుకు తీవ్ర అసహనం పెరుగుతోందని అంటున్నారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu public meetingschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth gendermodi transgendernippunippu naiduntr chandrababu naidupetentpublic meetingssingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospitalచంద్రబాబు నాయుడు