Telugu Global
NEWS

వివేక హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్.... కాసేపట్లో విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. తన భర్త హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు సరిగా లేదని పేర్కొంటూ భార్య సౌభాగ్యమ్మ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తుతో నిజానిజాలు బయటకు రావడం లేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఇక వైఎస్ వివేక హత్య కేసులో ఇంతకు మునుపే రెండు పిల్స్ దాఖలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ […]

వివేక హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్.... కాసేపట్లో విచారణ
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. తన భర్త హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు సరిగా లేదని పేర్కొంటూ భార్య సౌభాగ్యమ్మ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తుతో నిజానిజాలు బయటకు రావడం లేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

ఇక వైఎస్ వివేక హత్య కేసులో ఇంతకు మునుపే రెండు పిల్స్ దాఖలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక అధ్యక్షుడు అనిల్ ఈ పిల్స్ దాఖలు చేశారు. వివేక హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని.. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించాలని ఆ పిటిషన్లలో కోరారు. ఈ మూడింటినీ కలిపి హైకోర్టు ఇవాళ విచారించనుంది.

ఈ నెల 15న వివేకానంద రెడ్డిని పులివెందులలోని ఆయన గృహంలోనే గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తన తండ్రి మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూతురు సునీతారెడ్డి కూడా గతంలోనే డిమాండ్ చేశారు.

First Published:  26 March 2019 7:25 AM IST
Next Story