Telugu Global
NEWS

మేనిఫెస్టో కూడా లీకులేనా చంద్రబాబూ!

నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజకీయ వ్యూహ రచనలో అపర చాణుక్యుడు. ఇప్పటి వరకు ఇవే ఆయన మారు పేర్లు. ఇక నుంచి ఆయన్ని నారా లీకుల నాయుడు అని పిలవాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు. ఇన్నాళ్లూ తాను ఏం చేయాలనుకున్నారో, ఎలా చేయాలనుకున్నారో తన పచ్చ మీడియా ద్వారా లీకులు వదిలే వారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్నప్పటి […]

మేనిఫెస్టో కూడా లీకులేనా చంద్రబాబూ!
X

నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజకీయ వ్యూహ రచనలో అపర చాణుక్యుడు. ఇప్పటి వరకు ఇవే ఆయన మారు పేర్లు. ఇక నుంచి ఆయన్ని నారా లీకుల నాయుడు అని పిలవాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు.

ఇన్నాళ్లూ తాను ఏం చేయాలనుకున్నారో, ఎలా చేయాలనుకున్నారో తన పచ్చ మీడియా ద్వారా లీకులు వదిలే వారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి లీకుల మంత్రాన్ని నిత్యం జపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

రామారావు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రివర్గ సమావేశంపై లీకులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ అలవాటుని తర్వాత కూడా కొనసాగిస్తున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

పుట్టుకతో వచ్చిన బుద్ధి కడ వరకు పోదు అన్నట్లుగా ఈ లీకుల అలవాటును చంద్రబాబునాయుడు వదలడం లేదంటున్నారు. అది ఎంతవరకూ పోయిందంటే పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పే పార్టీ అధికారిక ప్రమాణ పత్రమైన మేనిఫెస్టోను కూడా కొద్దికొద్దిగా లీకులుగా విడుదల చేసే వరకు వెళ్ళిందంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే తమ పచ్చ మీడియాలో మాత్రం ఉద్యోగులకు ఫిట్మెంట్ అని, జీతాల పెరుగుదల అని, మహిళలకు రుణాలు అని, రైతులకు కొండంత సాయం అని, యువకులకు ఇది చేస్తాం… అది చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారంటూ పచ్చ మీడియా వరుస కథనాలు ప్రచురిస్తోంది.

దీనికి కారణం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలకు వస్తున్న జన సందోహాన్ని చూసి మేనిఫెస్టోను లీకుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి, జగన్ హవాను అడ్డుకోవాలనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏ పార్టీ అయినా తమ మేనిఫెస్టో ద్వారా ఏం చేస్తారో చెప్పడం దేశవ్యాప్తంగా ఉందని, ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో రోజు లీకుల ద్వారా తెలియజేయడం ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అందుకే ఇక నుంచి ఆయనను చంద్రబాబు నాయుడు అని కాకుండా నారా లీకుల నాయుడు అనాల్సి వస్తుందేమోనని అంటున్నారు.

First Published:  25 March 2019 11:13 PM GMT
Next Story