కేసీఆర్‌కు నోటీసులు పంపిన హైకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవాళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన అఫిడవిట్ తప్పుగా ఇచ్చారంటూ ఒకరు పిర్యాదు చేశారు. గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ తన క్రిమినల్ కేసుల గురించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం 64 క్రిమినల్ కేసులుంటే కేవలం 4 కేసులు మాత్రమే చూపారని […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవాళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన అఫిడవిట్ తప్పుగా ఇచ్చారంటూ ఒకరు పిర్యాదు చేశారు.
గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసీఆర్ తన క్రిమినల్ కేసుల గురించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం 64 క్రిమినల్ కేసులుంటే కేవలం 4 కేసులు మాత్రమే చూపారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసినందుకు గాను కేసీఆర్‌ను వెంటనే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఆయన కోర్టుకు విన్నవించారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కేసీఆర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.