Telugu Global
NEWS

బాబుకు పాఠం చెప్పిన.... బీకాం లో ఫిజిక్స్‌....

జలీల్‌ ఖాన్…. ఆ పేరు కన్నా బీకాం లో ఫిజిక్స్ అంటే ఎవరైనా సులభంగా గుర్తుపడతారు. ఆ జలీల్‌ ఖాన్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ మీద 2014లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. బాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టోకుగా కొంటున్నప్పుడు పనిలో పనిగా జలీల్‌ ఖాన్‌ను కూడా కొనేశాడు. అయితే జలీల్‌ ఖాన్‌ మాత్రం నేను డబ్బులకు అమ్ముడుపోలేదు…. మంత్రి పదవి ఇస్తానంటే ఆశ పడ్డాను…. కానీ చంద్రబాబు మోసం చేశాడు…. […]

బాబుకు పాఠం చెప్పిన.... బీకాం లో ఫిజిక్స్‌....
X

జలీల్‌ ఖాన్…. ఆ పేరు కన్నా బీకాం లో ఫిజిక్స్ అంటే ఎవరైనా సులభంగా గుర్తుపడతారు. ఆ జలీల్‌ ఖాన్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ మీద 2014లో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. బాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టోకుగా కొంటున్నప్పుడు పనిలో పనిగా జలీల్‌ ఖాన్‌ను కూడా కొనేశాడు.

అయితే జలీల్‌ ఖాన్‌ మాత్రం నేను డబ్బులకు అమ్ముడుపోలేదు…. మంత్రి పదవి ఇస్తానంటే ఆశ పడ్డాను…. కానీ చంద్రబాబు మోసం చేశాడు…. అని ఒకింత బాధపడ్డాడు. ఆ తరువాత చంద్రబాబు ఇచ్చిన చిన్న పదవితో, తాయిలాలతో సర్ధుకుపోయాడు.

అయినా లోలోపల చంద్రబాబంటే ఆయనకు కోపమే. గతంలో జలీల్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనను ముప్పతిప్పలు పెట్టి, ఆయనపై దాడి కూడా చేసింది. ఈ అవమానాలన్నింటిని లోలోపల బరిస్తున్న జలీల్‌ ఖాన్‌ టైమ్‌ చూసి ఇప్పుడు చంద్రబాబుకు పాఠం చెప్పేలా ఉన్నాడు.

అది ఎలాగంటే…. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి జలీల్‌ ఖాన్‌కు టిక్కెట్‌ను నిరాకరించాడు చంద్రబాబు. నీకు టిక్కెట్‌ ఇస్తే గెలిచే అవకాశం లేదని ముఖం మీదే చెప్పేశాడు. అన్ని ప్రయత్నాలూ చేసిన జలీల్‌ ఖాన్‌ చివరకు రాజీ పడి తన కూతురుకి టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. అందుకు కూడా మొదట నిరాకరించిన చంద్రబాబు ఎట్టకేలకు అంగీకరించాడు.

ఇక్కడే జలీల్‌ ఖాన్‌ తన బీకాం లో ఫిజిక్స్‌ నాలెడ్జినంతా ప్రదర్శించినట్లున్నాడు. కూతురు చేత నామినేషన్‌ వేయిస్తూ తను కూడా డెమ్మీ అభ్యర్ధిగా నామినేషన్‌ వేశాడు. కూతురు నామినేషన్‌ లో సమర్పించవలసిన అన్ని సర్టిఫికేట్లను సమర్పించలేదు. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. నామినేషన్‌ వేసే లోగా ఆ పౌరసత్వాన్ని క్యాన్సిల్‌ చేసుకోవాలి. కానీ ఆమె ఆ పని చేయలేదు.

దాంతో ఈరోజు జరిగే స్క్రూటినీలో ఆమె అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. అప్పుడు ఇక ఆటోమ్యాటిక్‌గా జలీల్‌ ఖానే అభ్యర్ధి అవుతాడు. ఇదీ జలీల్‌ ఖాన్‌ బీకాం లో ఫిజిక్స్‌ తెలివంటే….! టిక్కెట్‌ ఇవ్వనన్న చంద్రబాబు చేతే టిక్కెట్‌ ఇప్పించుకోగలుగుతున్నాడు కదా…!

First Published:  26 March 2019 8:10 AM IST
Next Story