యూనిఫాం తీసేస్తే మేమూ మాట్లాడుతాం " వైసీపీకి ఎస్పీ ప్రవీణ్ వార్నింగ్
ఏపీలో ఎన్నికల వేళ కొందరు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని… వారిని పక్కన పెట్టాలని వైసీపీ డిమాండ్ చేయడంపై ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. తనతో పాటు పలువురు అధికారులపై ఈసీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన అంశం తమ దృష్టికి రాలేదని చెబుతూనే… పోలీసు అధికారులపై రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాము చట్ట ప్రకారమే పనిచేస్తామన్నారు. తమకు ఒక పార్టీనో, ఒక నేతో ముఖ్యం కాదన్నారు. నాయకులు వంద మాట్లాడుతారని… యూనిఫాం తీస్తే తామూ మాట్లాడగలమన్నారు. చీరాల నియోజకవర్గంలో […]

ఏపీలో ఎన్నికల వేళ కొందరు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని… వారిని పక్కన పెట్టాలని వైసీపీ డిమాండ్ చేయడంపై ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు.
తనతో పాటు పలువురు అధికారులపై ఈసీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన అంశం తమ దృష్టికి రాలేదని చెబుతూనే… పోలీసు అధికారులపై రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
తాము చట్ట ప్రకారమే పనిచేస్తామన్నారు. తమకు ఒక పార్టీనో, ఒక నేతో ముఖ్యం కాదన్నారు. నాయకులు వంద మాట్లాడుతారని… యూనిఫాం తీస్తే తామూ మాట్లాడగలమన్నారు.
చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు పనిచేస్తున్నారన్న ఆరోపణలను ఎస్పీ కొట్టిపారేశారు. పాత కేసులు తిరగదోడుతున్నారన్నది అవాస్తవమన్నారు.