అవమాన భారంతో సీపీఐ.... జనసేనకు గుడ్‌బై
టీడీపీ- జనసేన మధ్య బంధం దాచినా దాగడం లేదు. టీడీపీకి ఇబ్బంది కలగకుండా జనసేన పావులు కదుపుతోంది. టీడీపీ అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయనుకున్న చోట ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థులను మార్చేస్తోంది. తన అభ్యర్థులనే కాకుండా… పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన సీట్లను రద్దు చేసి తన అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని సీపీఐకి జనసేన కేటాయించింది. దాంతో సీపీఐ అభ్యర్థిగా చలసాని అజయ్ కుమార్‌ను సీపీఐ ఎంపిక చేసుకుంది. సోమవారం నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఇంతలో హఠాత్తుగా జనసేన తన […]
టీడీపీ- జనసేన మధ్య బంధం దాచినా దాగడం లేదు. టీడీపీకి ఇబ్బంది కలగకుండా జనసేన పావులు కదుపుతోంది. టీడీపీ అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయనుకున్న చోట ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థులను మార్చేస్తోంది. తన అభ్యర్థులనే
కాకుండా… పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన సీట్లను రద్దు చేసి తన అభ్యర్థులను ప్రకటించింది.
పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని సీపీఐకి జనసేన కేటాయించింది. దాంతో సీపీఐ అభ్యర్థిగా చలసాని అజయ్ కుమార్‌ను సీపీఐ ఎంపిక చేసుకుంది. సోమవారం నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఇంతలో హఠాత్తుగా జనసేన తన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబును ప్రకటించింది. దీంతో సీపీఐ కంగుతింది. జనసేన ఇలా ఎందుకు చేసింది అంటే
టీడీపీ అభ్యర్థి కేశినేని నాని కోసమే అన్నది స్పష్టంగా సీపీఐకి అర్థమైపోయింది.
కాపు ఓటింగ్ వైసీపీ అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉండడంతో జనసేన తన అభ్యర్థిని బరిలోకి దింపింది. అలా చేయడం ద్వారా కాపు ఓటును చీల్చి… టీడీపీ అభ్యర్థి ని గట్టెక్కించేందుకు ఆఖరి నిమిషంలో జనసేన-టీడీపీ నేతలు వ్యూహం మార్చినట్టు సీపీఐ ఒక నిర్ధారణకు వచ్చింది.
నూజివీడు స్థానంలోనూ జనసేన ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. తొలుత సీపీఐకి ఈ స్థానాన్ని కేటాయించారు. కానీ టీడీపీ కోసం తిరిగి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ఇలా పలు నియోజక వర్గాల్లో వైసీపీ ఓట్లను చీల్చడం ద్వారా తిరిగి టీడీపీని గెలిపించేందుకు జనసేన అభ్యర్థులను నిలుపుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో వ్యూహాన్ని ముసుగుతీసేసి అమలు చేసేందుకు కూడా జనసేన వెనుకాడడం లేదు.
ఈ నేపథ్యంలో జనసేనలో పొత్తుపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఏపీలో ఆనవాళ్లు లేని బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించి, వామపక్షాలకు చెరో ఏడు స్థానాలు కేటాయించడంతోనే వామపక్షాలను పవన్ తీవ్రంగా అవమానించారని… దాన్ని
దిగమింగుకుని ముందుకెళ్తుంటే ఇప్పుడు ఏకంగా పొత్తులో కేటాయించిన తన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడం ఏమిటని సీపీఐ రుసరుసలాడుతోంది. అయితే సీపీఐ జనసేనతో పొత్తు తెంచుకోకుండా… మరో రాజకీయ పార్టీ బుజ్జగింపులకు దిగింది.