Telugu Global
NEWS

జనసేనలో నా టికెట్‌ అమ్మేశారు...

జనసేనపై సొంత పార్టీ నేతలు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలగాణ వైస్ చైర్మన్ దువ్వెల సృజన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆమె… పోలవరం అసెంబ్లీ టికెట్‌ను అమ్మేశారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని చిర్రి బాలరాజుకు టికెట్ ఇచ్చారన్నారు. దానిపై తాను ప్రశ్నిస్తే… 50లక్షలు ఇస్తే టికెట్ వస్తుందని చెప్పారని సృజన వివరించారు. ఇంతకాలం కష్టపడి పోలవరంలో జనసేన పార్టీని నిలబడితే చివరకు ఇలా టికెట్లు అమ్ముకుని నమ్ముకున్న […]

జనసేనలో నా టికెట్‌ అమ్మేశారు...
X

జనసేనపై సొంత పార్టీ నేతలు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలగాణ వైస్ చైర్మన్ దువ్వెల సృజన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆమె… పోలవరం అసెంబ్లీ టికెట్‌ను అమ్మేశారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని చిర్రి బాలరాజుకు టికెట్ ఇచ్చారన్నారు.

దానిపై తాను ప్రశ్నిస్తే… 50లక్షలు ఇస్తే టికెట్ వస్తుందని చెప్పారని సృజన వివరించారు. ఇంతకాలం కష్టపడి పోలవరంలో జనసేన పార్టీని నిలబడితే చివరకు ఇలా టికెట్లు అమ్ముకుని నమ్ముకున్న వారికి మోసం చేశారన్నారు.

పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు 20 రోజులుగా పార్టీ ఆఫీస్‌ చుట్టూ తిరిగినా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీకి మేలు జరిగేలా అభ్యర్థులను ఎంపిక చేశారని ఆమె ఆరోపించారు.

First Published:  23 March 2019 2:14 AM IST
Next Story