Telugu Global
NEWS

14వ స్థానానికి పడిపోయిన చంద్రబాబు

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిఎవరన్న దానిపై సీ ఓటర్‌ – ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్‌తో కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కేసీఆర్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు. కేసీఆర్‌ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌ సీఎం ఉన్నారు. మూడో స్థానంలో ఓడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. నాలుగో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకు మాత్రం బాగా పడిపోయింది. ఆయన ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14వ స్థానానికి పడిపోయారు. […]

14వ స్థానానికి పడిపోయిన చంద్రబాబు
X

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిఎవరన్న దానిపై సీ ఓటర్‌ – ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్‌తో కలిసి సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో కేసీఆర్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు. కేసీఆర్‌ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌ సీఎం ఉన్నారు. మూడో స్థానంలో ఓడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. నాలుగో స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకు మాత్రం బాగా పడిపోయింది. ఆయన ప్రజాదరణ కలిగిన
ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14వ స్థానానికి పడిపోయారు. మమతా బెనర్జీ 9వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు కంటే బీహార్ సీఎం నితీష్‌ కుమారే ముందున్నారు. చంద్రబాబు ప్రజల నుంచి మెప్పు పొందిన ముఖ్యమంత్రుల్లో 14 వస్థానంలో ఉండగా… బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్ ఆరో స్థానంలో ఉన్నారు.

తమిళనాడు సీఎం అతి తక్కువ ప్రజాదరణ కలిగిన సీఎంగా ఉన్నారు. ఆయన పాలన పట్ల కేవలం 18.7%ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు.

First Published:  23 March 2019 5:21 AM IST
Next Story