Telugu Global
Cinema & Entertainment

హాస్పిటల్‌లో చేరిన 'రౌడీ బాయ్'

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పపరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో. తాజాగా ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. విజయ్ నటిస్తున్న మరో చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్. వరుసగా పగలు రాత్రి షూటింగ్స్‌తో బిజీగా గడపడంతో విజయ్ కొంత అస్వస్థత పాలయ్యాడట. బుధవారం షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో బాగా అలిసిపోయిన విజయ్ మరుసటి రోజున షూటింగ్‌కి వెళ్లలేక పోయాడు అని టాక్. లైట్‌గా జ్వరం రావడంతో విజయ్ […]

హాస్పిటల్‌లో చేరిన రౌడీ బాయ్
X

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పపరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో. తాజాగా ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. విజయ్ నటిస్తున్న మరో చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్.

వరుసగా పగలు రాత్రి షూటింగ్స్‌తో బిజీగా గడపడంతో విజయ్ కొంత అస్వస్థత పాలయ్యాడట. బుధవారం షూటింగ్స్ ఎక్కువగా ఉండటంతో బాగా అలిసిపోయిన విజయ్ మరుసటి రోజున షూటింగ్‌కి వెళ్లలేక పోయాడు అని టాక్.

లైట్‌గా జ్వరం రావడంతో విజయ్ రెస్ట్ తీసుకొనే ఉదేశ్యంతో హాస్పటల్‌లో జాయిన్ అయ్యాడట. హాస్పిటల్‌లో రోజంతా గడిపి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని నేటి నుండి తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘డియర్ కామ్రెడ్’ మేలో విడుదల కానుండడం, ఇంకా కొంత వర్క్ బాలెన్స్ ఉండడంతో విజయ్ తీరిక లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.

రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు భరత్ కమ్మ. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

First Published:  22 March 2019 8:35 AM IST
Next Story