నా పార్టీ నా పార్టీ అని అంటావే.. అది అన్నగారి పార్టీ : మోహన్ బాబు
తెలుగుదేశం పార్టీని ప్రతీసారి నా పార్టీ.. నా పార్టీ అంటావే చంద్రబాబు..? అది అన్నగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.. నీవే ఆయన వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు అంటూ చంద్రబాబుపై నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించక పోవడాన్నినిరసిస్తూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో కలసి ఇవాళ తిరుపతిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే బైఠాయించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అంటే నాకూ ఇష్టమే.. కాని ఆయన నాటకాలు […]
తెలుగుదేశం పార్టీని ప్రతీసారి నా పార్టీ.. నా పార్టీ అంటావే చంద్రబాబు..? అది అన్నగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.. నీవే ఆయన వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు అంటూ చంద్రబాబుపై నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించక పోవడాన్నినిరసిస్తూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో కలసి ఇవాళ తిరుపతిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే బైఠాయించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అంటే నాకూ ఇష్టమే.. కాని ఆయన నాటకాలు మాత్రం ఇష్టం లేదన్నారు. సినిమాల్లో నటిస్తే డబ్బిస్తారు కానీ చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించమని లేఖ రాస్తే కనీసం స్పందించలేదని.. ఏం చంద్రబాబుకు అంత పొగరా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను ప్రవేశపెట్టారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. అన్ని పథకాలకు తూట్లు పొడుస్తున్నావని దుయ్యబట్టారు.
పగలు తర్వాత రాత్రి వస్తుంది.. అమవాస్య తర్వాత పున్నమి వస్తుంది. అలాగే ఎల్లకాలం మనది కాదని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. అన్ని కోట్లు సంపాదించి చివరకు రేపు నువ్వేమవుతావో తెలుసుకోమన్నారు. త్వరలోనే ఈ సమస్యపై కోర్టును ఆశ్రయిస్తా.. మాకు న్యాయం చేయమని వేడుకుంటా. కోర్టు ఏం చెబితే అది శిరసావహిస్తానని మోహన్ బాబు స్పష్టం చేశారు. అంతకు మునుపు మోహన్ బాబు ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు.