Telugu Global
NEWS

నేటినుంచే ఐపీఎల్ -12 హంగామా

ప్రారంభపోటీలో బెంగళూరుతో చెన్నై ఢీ ఐపీఎల్ తొలిఅంచె పోటీలపై ఎన్నికల ప్రభావం భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ -12వ సీజన్ తొలిఅంచె పోటీలకు…చెన్నై చెపాక్ స్టేడియం లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. శనివారం జరిగే ప్రారంభమ్యాచ్ లో.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సవాల్ విసురుతోంది. ధోనీ, కొహ్లీ కెప్టెన్లుగా జరిగే ఈమ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన […]

నేటినుంచే ఐపీఎల్ -12 హంగామా
X
  • ప్రారంభపోటీలో బెంగళూరుతో చెన్నై ఢీ
  • ఐపీఎల్ తొలిఅంచె పోటీలపై ఎన్నికల ప్రభావం

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ -12వ సీజన్ తొలిఅంచె పోటీలకు…చెన్నై చెపాక్ స్టేడియం లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. శనివారం జరిగే ప్రారంభమ్యాచ్ లో.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సవాల్ విసురుతోంది.

ధోనీ, కొహ్లీ కెప్టెన్లుగా జరిగే ఈమ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా అమరుల సహాయ నిధికి ఇవ్వాలని.. చెన్నై ఫ్రాంచైజీ నిర్ణయించింది.

ఇప్పటికే రెండుజట్ల సభ్యులు చెపాక్ స్టేడియంలో జరిగిన నెట్ ప్రాక్టీసులో పాల్గొని సమరానికి సై అంటున్నారు. ఈ టోర్నీ పలువురు యువ ఆటగాళ్లతో పాటు అంబటి రాయుడు లాంటి సీనియర్ క్రికెటర్ కు సైతం కీలకం కానుంది.

ఐపీఎల్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే …ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ఎంపిక ఉంటుందని కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇంతకు ముందే ప్రకటించడంతో.. ఐపీఎల్ మ్యాచ్ లు పట్టుగా సాగే అవకాశం ఉంది.

లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ కేవలం తొలిఅంచెలోని 17 రౌండ్ల మ్యాచ్ లు మాత్రమే నిర్వహించనున్నారు.

First Published:  22 March 2019 2:48 PM IST
Next Story