వైఎస్ భారతి పేరుతో లేఖలు రాసేస్తున్నారు...
వైఎస్ భారతి బహిరంగ లేఖ అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతోంది. తన మనుసులోని భావాలు, భయాలు, ఆందోళన…. పంచుకోవాలన్న ఉద్దేశంతోనే తానీ లేఖ రాసినట్టు భారతి చెప్పినట్లు అందులో ఉంది. అందులో జగన్ గొప్పతనాన్ని వివరిస్తూ, పవన్ కల్యాణ్, చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణను విమర్శిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. మాయావతి, పవన్ కల్యాణ్ కలవడం వెనుక శికండి రాజకీయం ఉందనిపిస్తోందంటూ అందులో ఒక వ్యాఖ్య కూడా ఉంది. అయితే ఈ లేఖకు, వైఎస్ భారతికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. ఈ […]

వైఎస్ భారతి బహిరంగ లేఖ అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతోంది. తన మనుసులోని భావాలు, భయాలు, ఆందోళన…. పంచుకోవాలన్న ఉద్దేశంతోనే తానీ లేఖ రాసినట్టు భారతి చెప్పినట్లు అందులో ఉంది.
అందులో జగన్ గొప్పతనాన్ని వివరిస్తూ, పవన్ కల్యాణ్, చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణను విమర్శిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. మాయావతి, పవన్ కల్యాణ్ కలవడం వెనుక శికండి రాజకీయం ఉందనిపిస్తోందంటూ అందులో ఒక వ్యాఖ్య కూడా ఉంది.
అయితే ఈ లేఖకు, వైఎస్ భారతికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. ఈ లేఖను సృష్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అవాస్తవాలను సర్క్యులేట్ చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
Posted by YSR Congress Party – YSRCP on Thursday, 21 March 2019