ఐపీఎల్ కంటే ప్రపంచకప్పే ప్రధానమంటున్న కొహ్లీ
ఐపీఎల్ ఏటా వస్తుంది, ప్రపంచకప్ నాలుగేళ్లకోసారి అంటూ హితవు ఐపీఎల్ తో అలసిపోవద్దంటూ సహఆటగాళ్లకు కొహ్లీ సలహా ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభానికి ముందే…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…తన జట్టు సభ్యులకు సలహాలు, చిట్కాలు, సూచనలు ఇచ్చాడు. ఐపీఎల్ కోసం ఒళ్ళు హూనం చేసుకోవద్దని…అలసిపోకుండా, గాయాలు కాకుండా ఫిట్ నెస్ ను కాపాడుకోవాలంటూ హితవు పలికాడు. ఐపీఎల్ ఏటా వస్తుందని…అదే ప్రపంచకప్ మాత్రం నాలుగేళ్లకోసారి వస్తుందన్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా […]
- ఐపీఎల్ ఏటా వస్తుంది, ప్రపంచకప్ నాలుగేళ్లకోసారి అంటూ హితవు
- ఐపీఎల్ తో అలసిపోవద్దంటూ సహఆటగాళ్లకు కొహ్లీ సలహా
ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభానికి ముందే…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…తన జట్టు సభ్యులకు సలహాలు, చిట్కాలు, సూచనలు ఇచ్చాడు.
ఐపీఎల్ కోసం ఒళ్ళు హూనం చేసుకోవద్దని…అలసిపోకుండా, గాయాలు కాకుండా ఫిట్ నెస్ ను కాపాడుకోవాలంటూ హితవు పలికాడు.
ఐపీఎల్ ఏటా వస్తుందని…అదే ప్రపంచకప్ మాత్రం నాలుగేళ్లకోసారి వస్తుందన్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో రాణించాలంటే పామ్ తో పాటు ఫిట్ నెస్ కూడా ప్రధానమని…మార్చి 23 నుంచి ఏడువారాలపాటు ఇంగ్లండ్ అండ్ వేల్స్ దేశాలు వేదికగా జరిగే ప్రపంచకప్ కు సిద్ధంగా ఉండాలని సహఆటగాళ్లను హెచ్చరించాడు.
తడవకో మాటతో గజిబిజి…
ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమికి ముందు వరకూ…ఐపీఎల్ ఆటతీరు…ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా ఎంపికకు ఏమాత్రం ప్రామాణికం కాదని చెప్పిన విరాట్ కొహ్లీ… ఆ తర్వాత మాట మార్చాడు.
ఐపీఎల్ టోర్నీలో ఆటతీరు, ఫామ్, ఫిట్ నెస్ లను పరిగణనలోకి తీసుకొనే ఎంపిక ఉంటుందంటూ బాంబు పేల్చాడు. మరోవైపు.. టీమిండియా -ఏ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ మాత్రం ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు.
ఓటమి మంచిదే….
ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా 2-3తో ఓటమి పొందటం..మన మంచికేనంటూ ద్రావిడ్ చెప్పాడు.
ఈ ఓటమి ఎదురుకాకపోతే… టీమిండియా తీరు వేరేవిధంగా ఉండేదని… ప్రపంచకప్ గెలుచుకొనే ఏకైక జట్టు టీమిండియా మాత్రమే అన్న భ్రమలు ఒక్కసారిగా తొలగి పోయాయని.. ఫేవరెట్ జట్లలో భారత్ కూడా ఒకటన్న వాస్తవాన్ని జట్టు సభ్యులతో పాటు అభిమానులు గుర్తించాలని ద్రావిడ్ సలహా ఇచ్చాడు.
టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలవాలంటే…అత్యుత్తమ స్థాయిలో రాణించక తప్పదని చెప్పాడు.