Telugu Global
NEWS

ప్రతీకారం తీర్చుకుంటా...

తిరిగి వైసీపీలో చేరడం తనకు సొంతింటికి వచ్చినట్టుగా ఉందన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి. చంద్రబాబు చేతిలో తాను దారుణంగా మోసపోయి బయటకు వచ్చానన్నారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… కేవలం డబ్బు ప్రభావంతోనే తనకు టికెట్ ఎగ్గొట్టారన్నారు. వైసీపీకి అన్యాయం చేసి వెళ్లిన తనకు టీడీపీలో అన్యాయం, మోసం రెండూ జరిగాయన్నారు. అందుకే జగన్‌ వద్దకు వచ్చి తన తప్పును సరిదిద్దుకున్నానని చెప్పారు. జిల్లాలో వైసీపీ గెలుపు కోసం తన శక్తినంతా ఉపయోగిస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో […]

ప్రతీకారం తీర్చుకుంటా...
X

తిరిగి వైసీపీలో చేరడం తనకు సొంతింటికి వచ్చినట్టుగా ఉందన్నారు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి. చంద్రబాబు చేతిలో తాను దారుణంగా మోసపోయి బయటకు వచ్చానన్నారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… కేవలం
డబ్బు ప్రభావంతోనే తనకు టికెట్ ఎగ్గొట్టారన్నారు.

వైసీపీకి అన్యాయం చేసి వెళ్లిన తనకు టీడీపీలో అన్యాయం, మోసం రెండూ జరిగాయన్నారు. అందుకే జగన్‌ వద్దకు వచ్చి తన తప్పును సరిదిద్దుకున్నానని చెప్పారు. జిల్లాలో వైసీపీ గెలుపు కోసం తన శక్తినంతా ఉపయోగిస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో చేరుతున్నానని వివరించారు. తనను మోసం చేసిన చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటానని ఎస్వీ చెప్పారు.

వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఉడతా భక్తిగా పనిచేస్తానన్నారు. పత్తికొండ, ఆలూరు, కర్నూలు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపించుకొస్తానన్నారు. తన తండ్రి మూడు సార్లు పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. పత్తికొండలో తన బంధువులు కూడా వైసీపీలో చేరారన్నారు.

First Published:  21 March 2019 12:54 PM IST
Next Story