Telugu Global
NEWS

చిన్న బాబు గెలుపు కష్టమే పెదబాబూ !

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆశలు అడియాసలే అవుతాయా? ఆయన ఏకైక కుమారుడు నారా లోకేష్ శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలవుతారా? మంగళగిరి శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కు విజయం దక్కడం దాదాపు అసాధ్యమైనా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు….  ముఖ్యంగా పద్మశాలీల ఓట్లు అధికంగా ఉన్నాయని, వారంతా తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఇటీవల జరిపిన సర్వేలో […]

చిన్న బాబు గెలుపు కష్టమే పెదబాబూ !
X

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆశలు అడియాసలే అవుతాయా? ఆయన ఏకైక కుమారుడు నారా లోకేష్ శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలవుతారా? మంగళగిరి శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కు విజయం దక్కడం దాదాపు అసాధ్యమైనా?

ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు…. ముఖ్యంగా పద్మశాలీల ఓట్లు అధికంగా ఉన్నాయని, వారంతా తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ఈ సర్వే ఫలితాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా అందించినట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో చివరిక్షణంలో అభ్యర్థిని ప్రకటించడం, పైగా స్థానిక నాయకులు ఎవరినీ సంప్రదించకుండా ఏకఛత్రాధిపత్యంగా నిర్ణయం తీసుకోవడం స్థానిక తెలుగుదేశం నాయకులకు మింగుడు పడడం లేదు అంటున్నారు. నారా లోకేష్ ని చివరి నిమిషంలో అభ్యర్థిగా ప్రకటించకుండా కనీసం రెండు నెలల ముందు పచ్చ పత్రికల్లో లీకు వార్తలు వచ్చేలా చేసినా ఫలితం వేరేలా ఉండేది అంటున్నారు.

గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన స్థానిక నాయకుడు చిరంజీవి పట్ల ప్రజల్లో సానుభూతి ఉందంటున్నారు. ఆయనను కాదని హఠాత్తుగా చినబాబు లోకేష్ ను తీసుకురావడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రజలు, నియోజక వర్గంలోని బీసి కులాలకు చెందిన వారు కూడా నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సర్వేలో తేలినట్లు సమాచారం.

దీనికి తోడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక బీసీ నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని, తనను సనత్ నగర్ నియోజకవర్గంలో ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేసిన చినబాబు ఓటమి కోసం ఆయన వ్యూహాత్మకంగా పని చేస్తున్నారని స్థానిక తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. మంగళగిరిలో చినబాబు గెలవడం దాదాపు అసాధ్యమేనని పెదబాబు చంద్రబాబు నాయుడికి స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  21 March 2019 4:58 AM IST
Next Story