మోదీకి 'మోడీ' ఎన్నికల సాయం!
ప్రధాని నరేంద్ర మోడీకి అవకాశాలే కాదు సమయమూ అలా కలిసి వచ్చేస్తోంది అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సారి అధికారానికి దూరం అవుతాం అన్న టెన్షన్ ప్రధాని నరేంద్ర మోడీని వెంటాడింది అంటున్నారు. ఈ భయం నుంచి బయటపడడానికి, దేశవ్యాప్తంగా తమపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన వ్యూహరచన కాకలు తీరిన రాజకీయ నాయకులకు కూడా అర్థం కావడం […]
ప్రధాని నరేంద్ర మోడీకి అవకాశాలే కాదు సమయమూ అలా కలిసి వచ్చేస్తోంది అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సారి అధికారానికి దూరం అవుతాం అన్న టెన్షన్ ప్రధాని నరేంద్ర మోడీని వెంటాడింది అంటున్నారు. ఈ భయం నుంచి బయటపడడానికి, దేశవ్యాప్తంగా తమపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన వ్యూహరచన కాకలు తీరిన రాజకీయ నాయకులకు కూడా అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహ రచనలో తొలిమెట్టు సైనిక చర్యలను వాడుకోవడమేనని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా సైనిక కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేయడం నమ్మలేక పోతున్నామని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, వామపక్షాలు విమర్శలు చేశాయి.
దీనిని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సర్జికల్ దాడులను సైతం చేయించింది ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని వెనుక ఎన్నికలలో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని ప్రతిపక్షాల అంచనా.
ఇక తాజాగా వేల కోట్ల రూపాయలు కొట్టేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని హఠాత్తుగా అరెస్టు చేయించడం వెనుక కూడా ఎన్నికల వ్యూహ రచనలో భాగమే అంటున్నారు. నీరవ్ మోడీ దేశాన్ని వదిలి పారిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా కిమ్మనకుండా కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లండన్ లో అరెస్టు చేయించారని, దీనిని తన విజయంగా ఎన్నికలలో చెప్పుకుంటారని అంటున్నారు.
విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ను తానే తిరిగి దేశానికి తీసుకు వచ్చాననే ఘనతతో ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పన్నిన రెండు వ్యూహాలలో ఒకటి ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సర్జికల్ దాడులు అయితే మరొకటి ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అరెస్ట్ చేయించడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహాలను తలుచుకున్న సీనియర్ రాజకీయ నాయకులు “అమ్మో మోడీ” అనకుండా ఉండలేకపోతున్నారు.